ఏపీ ప్రభుత్వంపై విద్వేశ వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాగా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే రఘురామ కాలికి అయిన గాయాలపై జీజీహెచ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
అయితే తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్ ఆస్పత్రికి పంపాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామ గాయాలకు సంబంధించిన వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసేంజర్ లో అందిన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా మెడికల్ బోర్డుతోపాటు రమేశ్ ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదని రఘురామ తరుఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
ఇక అంతకుముందు వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు అది పూర్తికాగానే వెనుక గేటు నుంచి ఆయన్ను గుంటూరు జైలుకు తీసుకెళ్లారు. అయితే ఈయన తరుఫున హైకోర్టుకు న్యాయవాదులు ఎక్కడంతో జిల్లా జైలు నుంచి రమేశ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామ గాయాలపై మెడికల్ రిపోర్టును విచారిస్తున్న హైకోర్టు దీనిపై కాసేపట్లోనే పూర్తి ఉత్తర్వులు ఇవ్వనుంది.
కాగా రఘురామను జైల్లో చంపడానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆయన భార్య ఆరోపించింది. వెంటనే జైలుకు పంపకుండా ఆస్పత్రికి తరలించాలని రఘురామ భార్య డిమాండ్ చేసింది. రఘురామకు కేంద్రప్రభుత్వమే రక్షణ కల్పించాలని ఆమె కోరింది.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.