వందలకోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను తెలుగుదేశానికి చెందిన కొందరు నాయకులు లోపాయికారీగా 22.44 కోట్లకు సొంతం చేసుకున్న వ్యవహారం ఎంత రాద్ధాంతం అయిపోయిందో అందరికీ తెలుసు. అయితే ఈ భూకబ్జా వంటి వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. అప్పటిదాకా , ఈ అవినీతి గురించి నిలదీసినప్పుడెల్లా... ఆ భూముల విలువ తక్కువే.. కావలిస్తే.. ఎవరైనా సరే.. 5 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వంలోని పెద్దలంతా సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు. తీరా హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వం చెప్పినట్లుగానే 5 కోట్లు అదనంగా చెల్లించి ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆ భూములు తీసుకోవచ్చునని చెప్పగానే.. ప్రభుత్వానికి నోటమాట పడిపోయింది.
అయితే తాజాగా హైకోర్టు మరో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ.. ఈ భూములకు మరోసారి బహిరంగ వేలం నిర్వహించాలని తీర్పు చెప్పింది. ప్రస్తుతానికి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు 5 కోట్లు ఎక్కువ గా 27.44 కోట్లు చెల్లించిన ఆళ్లకే భూములు దక్కినట్లు అనుకోవాలి.
అయితే కాజేయదలచుకున్న భూములు ఎటూ మనకు దక్కకుండాపోయాయి. మనం బాగుపడలేదు.. వైసీపీ వాళ్లు కూడా బాగుపడడానికి వీల్లేదు అనే దుష్ట ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరించడం వల్ల.. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆళ్ల పరం కావాల్సిన భూములకు మళ్లీ వేలం వేసే పరిస్థితి వచ్చిందని పలువురు అనుకుంటున్నారు.
సదావర్తి భూముల విషయంలో తెలుగుదేశానికి చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ తో పాటు మరికొందరు నాయకులు సిండికేట్ అయి పెద్ద నేతల ఆశీస్సులతో ఈ దందా నడిపించినట్లుగా పుకార్లు వచ్చాయి. కోర్టు తీర్పుల నేపథ్యంలో వారంతా కూడా ఈ అంశం గురించి మాట్లాడడం మానేసి తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతానికి రికార్డుల పరంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి చెందేవిగా భావిస్తున్న ఈ భూములకు ఆరువారాల్లో మళ్లీ వేలం నిర్వహించాలి. ఈ సారి చాలా పక్కాగా జాతీయస్థాయిలోని మీడియాలో ప్రకటనలు ఇచ్చిన తరువాతే వేలం నిర్వహించాలంటూ కోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది. ఇదే జరిగితే ఆ భూముల అసలు విలువ కూడా తేలే అవకాశం ఉంటుంది.