అసెంబ్లీ ర‌ద్దు..కేసీఆర్‌ కు కోర్టులో పెద్ద రిలీఫ్‌

Update: 2018-09-12 13:01 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు హైకోర్టులో ఊర‌ట ద‌క్కింది. విజ‌యంపై ధీమాతో...ప్ర‌తిప‌క్షాల‌ను ఎద‌గ‌నీయ‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌ను కేసీఆర్ అమల్లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌ పై అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు వ్యాజ్యం దాఖలైన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి...ఉన్నపళంగా అసెంబ్లీ రద్దు వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని త‌న పిటిష‌న్‌ లో ఆరోపించారు. ఐదేళ్ల లోపు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ బుధ‌వారం హైకోర్టులో విచారణకు రాగా - కోర్టు కొట్టివేసింది

అసెంబ్లీ ర‌ద్దు పిటిష‌న్‌ పై విచార‌ణ చేప్ట‌టిన ధ‌ర్మాస‌నం రాజ్యాంగం - చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌ లో కన్పించడం లేదని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగ అంశాలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. కేవలం రాజకీయ పలుకుబడి కోసమే కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముంద‌స్తుకు రాజ్యాంగ ప‌రంగా కీల‌క‌మైన రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నుంచి ఉప‌శ‌మ‌నం ద‌క్కిన‌ట్ల‌యింద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. మ‌రోవైపు ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను విడుద‌ల చేసేందుకు ఈసీ క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News