ప్లీన‌రీ రోజే కేసీఆర్‌ కు గ‌ట్టి షాక్ త‌గిలింది

Update: 2018-04-27 10:55 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు ప్లీన‌రీ రోజే ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓవైపు ప్లీన‌రీతో ఆయ‌న భ‌విష్య‌త్ రాజ‌కీయానికి బాటలు వేసుకుంటుండ‌గా మ‌రోవైపు ఆయ‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి రూపంలో మింగుడు ప‌రిణామం చోటుచేసుకుంది. అది కూడా హైకోర్టు రూపంలో కావ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ నేత - మాజీ మంత్రి కోమరెట్టి వెంకటరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విద్యార్హతలకు సంబంధించి దుబ్బాక నరసింహారెడ్డి - కంచర్ల భూపాల్ రెడ్డిలు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. అంతేకాకుండా కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వారిరువురిపై చెరో రూ. 25 వేల చొప్పున జరిమానా కూడా విధించింది.

కోమ‌టిరెడ్డి విద్యార్హ‌త‌కు టీఆర్ ఎస్ నేత‌లు దుబ్బాక నరసింహారెడ్డి - కంచర్ల భూపాల్ రెడ్డి వేసిన పిటిష‌న్ గత మూడేళ్లుగా ఈ పిటిషన్ కు సంబంధించి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా తుది తీర్పు వెలువ‌డింది. అయితే కాక‌తాళీయంగా అదే రోజు టీఆర్ ఎస్ ప్లీన‌రీ కావ‌డం విశేషం. ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిన విషయంలో కూడా కోమటిరెడ్డికి ఈ మధ్య కోర్టులో ఊరట లభించిన విషయం విదితమే. ఈ నేప‌థ్యంలో ప్లీన‌రీ రోజే ఈ తీర్పు రావ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మండిపడ్డారు. టీఆర్ ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. టీఆర్ ఎస్ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోమని ఉత్తమ్‌ ను కేసీఆర్ హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రగతిభవన్‌ లో 15 గదుల కంటే ఎక్కువ లేవు. 16వ గది ఉందని రుజువు చేస్తే.. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం స్పష్టం చేశారు. అక్కడ 16వ గది లేకపోతే ప్రగతి భవన్ ముందు ఉత్తమ్ ముక్కు నేలకు రాస్తాడా అని సీఎం ఛాలెంజ్ చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి టీ పీసీసీ పదవి తెచ్చిందే ఈ గులాబీ జెండా అని కేసీఆర్ తెలిపారు. `ఆనాడు పోరాటం చేయకపోతే నీవు ఈ రోజు పదవిలో ఉండే వాడివి కాదు. తమ పోరాటం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. 14 సంవత్సరాల పోరాటమే నేటి తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాలుక ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ నాయకులు తెలివి లేని నేతలు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు` అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
Tags:    

Similar News