ఎల్బీనగర్ టు లక్డీకపూల్.. 13 నిమిషాల్లో గుండె.. థాంక్యూ మెట్రో!

దీంతో... వ్యవస్థల మధ్య సహకారం ఎప్పుడూ అద్భుత ఫలితాలు ఇస్తుందని అంటున్నారు.

Update: 2025-01-18 06:18 GMT

హైదరాబాద్ లో అద్భుతం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ మెట్రో సహకరించింది. ఈ సందర్భంగా నిత్యం సమయంతో సంబంధం లేకుండా రద్దీగా ఉండే రోడ్లపై వీలుకాని ప్రయాణం.. మెట్రో రైలు గ్రీన్ ఛానెల్ ద్వారా సాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో... వ్యవస్థల మధ్య సహకారం ఎప్పుడూ అద్భుత ఫలితాలు ఇస్తుందని అంటున్నారు.

అవును... హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వానుభవం ఉన్నవారిని అడిగితే స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్ లోని గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆస్పత్రికి గుండెను తరలించాలంటే ఎంత సమయం పడుతుంది? చెప్పే పని లేదు.. కచ్చితంగా గంటకు అటు ఇటుగా సమయం అని చాలా మంది అభిప్రాయం!

ఈ సమయంలో... మెట్రో అధికారులను సంప్రదించారు. దీంతో... మెట్రో రైలు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో 13 నిమిషాల్లో హైదరబాద్ మెట్రో రైల్ గ్రీన్ కారిడార్ సహాయంతో ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్ లోని గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆస్పత్రికి దాత గుండెను వేగంగా తరలించారు.

ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు.. హైదరాబాద్ మెట్రోకు థాంక్స్ చెబుతుండగా.. నెటిజన్లు వారితో గొంతు కలులుపుతున్నారు. థాంక్యూ హైదరాబాద్ మెట్రో అని అంటున్నారు. హైదరాబాద్ మెట్రో, ఆస్పత్రి అధికారులు, వైద్య నిపుణుల సమన్వయంతో ఇది సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు.

కాగా... ఇలా అవయువాలను అత్యంత వేగంగా, సురక్షితంగా తరలించాల్సి వచ్చేటప్పుడు రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా హైదరబాద్ మెట్రో ఈ విధంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ ప్రాణాన్ని కాపాడంతో అభినందనలు వెల్లివెత్తుతున్నాయి.

Tags:    

Similar News