జగన్ కు బూస్ట్ ఇచ్చిన కేంద్ర మంత్రి!

ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-18 06:16 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎప్పటి నుంచో ఆందోళనకరమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని.. ఎప్పుడెప్పుడు ఆ ఆంధ్రుల హక్కుని ప్రైవేటుపరం చేసేద్దామా అనే ఉత్సాహంలో ఉందని చెబుతుంటారు. అయితే... గతంలో మోడీ సర్కార్ ఈ దిశగా ఆలోచన చేసినప్పుడు జగన్ సర్కార్ అడ్డుకుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీవ్ర ఉత్సాహం చూపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మూడు మిలియన్స్ టన్నుల ఉత్పత్తి ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో నడిచిందని చెప్పిన కుమారస్వామి.. 2016-17లో 7.3 మిలియన్ ల టన్నుల ఉత్పత్తికి ప్రయత్నించినప్పటి నుంచీ నష్టాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో... 2018-19, 2020-21లో రూ.930 కోట్ల లాభాలు వచ్చాయని అన్నారు. అయితే... కోవిడ్ సమయంలో ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినట్లు తెలిపారు.

ఆ సమయంలో... విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించిందని.. అదేవిధంగా యూనిట్ ను వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించిందని.. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని.. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు.

ఇలా గతంలో.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించిందని.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిందని.. దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించిందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇలా ఎన్డీయే కూటమిలోని కేంద్రమంత్రి స్వయంగా... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంలో జగన్ సర్కార్ పాత్రను నొక్కి చెప్పడం కచ్చితంగా వైసీపీకి బూస్ట్ అని అంటున్నారు పరిశీలకులు.

ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ స్పందించారు. ఈ సందర్భంగా... వారిరువురూ హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News