మీకంత విశాల హృదయం ఉంటే దాన్నెందుకు కూల్చారు: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఏపీ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పలుమార్లు హాట్ కామెంట్స్ చేసిన హైకోర్టు మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ తదితరాలను నిర్మిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ప్రజాధనం వృథా అవుతుందున్న బాధ మీకుంటే అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ఎందుకు కూల్చారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. దాన్ని కూల్చకుండా సమావేశ మందిరాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకోలేకపోయారా అని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పాఠశాలల ప్రాంగణాల్లో నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను విద్యా అవసరాల కోసం వినియోగిస్తామని.. వాటిని కూల్చివేస్తే ప్రజాధనం దుర్వినియోగమవుతుందని ప్రభుత్వం చెబుతోందని హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వానికి అంత విశాల హృదయం ఉంటే ప్రజావేదికను ఎందుకు కూల్చారని నిలదీసింది.
ప్రజావేదిక విషయంలో ప్రభుత్వం భిన్నవైఖరి ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది. ప్రజా ధనంతో నిర్మించిన వాటిని కూల్చడం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని వ్యాఖ్యానించింది. పాఠశాల ప్రాంగణాల్లో నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ విషయంలో వైఖరి తెలియజేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌ను.. అమికస్ క్యూరీ (కోర్టుకు సహాయకులు) సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తికి అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది.
పాఠశాలల ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దని పేర్కొంటూ 2020 జూన్ 11న హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని 2021లో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అవి అక్రమ నిర్మాణాలేనన్నారు. వీటికి చెల్లింపులు సైతం అక్రమమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.40 కోట్లు సొమ్ము చెల్లించినందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి వారి జేబు నుంచి సొమ్ము రాబడతామని హెచ్చరించారు.
ఈ నేపథ్యలో గత విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాల్లో నిర్మించిన కట్టడాలను విద్యా అవసరాలకే వినియోగిస్తామని వెల్లడించారు. తాజా విచారణలో సైతం ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అవి అక్రమ నిర్మాణాలైనప్పటికీ ప్రజాధనంతో నిర్మించారన్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని విద్యావసరాల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రజాధనంతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వినియోగించుకోవాలన్న విశాల హృదయం ప్రభుత్వానికి ఉంటే ప్రజావేదికను ఎందుకు కూల్చారని నిలదీశారు. గ్రామ సచివాలయాల విషయంలో ఓ రకంగా.. ప్రజావేదిక విషయంలో మరో విధంగా వ్యవహరించడం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను అమికస్‌క్యూరీకి అందజేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 24కి వాయిదా వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.