జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

Update: 2021-03-30 12:28 GMT
ఏపీలో జగన్ సర్కార్ గద్దెనెక్కాక రాజకీయ కారణాలతో రెండేళ్లుగా ఉపాధి హామీ బిల్లులు నిలిచిపోయాయి. దీనిపై బాధితులు హైకోర్టుకు ఎక్కారు. దీంతో ఏపీ సర్కార్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకుత తాము బిల్లులు చెల్లించబోమంటూ మంత్రులే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని.. అధికారులు కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారని బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు..

దీనిపై టీడీపీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. చివరకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మొత్తం 7 లక్షల పనులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పిటీసనర్ తరుఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి హామీ మొత్తాలను దారి మళ్లించి ఇతర పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఏపీలో 2018 నుంచి 2019 వరకు జరిగిన ఉపాధి హామీ పనులు, వాటి బిల్లుల చెల్లింపులపై సమగ్రంగా అఫిడివిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ను ఎందుకు అమలు చేయలేదని.. రెండు వారాల్లో పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సరైన సమాధానం రాకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను హైకోర్టు పిలిపిస్తామని హెచ్చరించింది.
Tags:    

Similar News