కర్నూల్ కి కార్యాలయాల తరలింపు పై జగన్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు !

Update: 2020-02-04 09:55 GMT
విజిలెన్స్ కార్యలయం తరలింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. దీనిపై సరైన వివరణ ఇవ్వలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల పై విచారణ పెండింగ్‌ లో ఉండగా కార్యాలయాలని కర్నూల్ కి ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనితో మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ తెలిపారు. ఈ నెల 26 వరకు కార్యాలయాల తరలింపునపై స్టే విధిస్తినట్లు హైకోర్టు తెలిపింది.

సోమవారం కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతుల తరపున, న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పిటిషన్‌ లో తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపు పై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్‌, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు.

రెండు లంచ్ మోషన్ పిటిషన్లు ఇదే అంశంపై దాఖలయ్యాయి. మొత్తం మూడు పిటిషన్ల గురించి మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం అమరావతికి సంబంధించిన కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయని రైతులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ జీవోలను ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీని పై వివరణ ఇవ్వాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను కోరింది. ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు కార్యాలయాలను ఎక్కడికీ తరలించవద్దని ఆదేశాలను కోర్టు జారీ చేసిందని అయినా ఆదేశాలను లెక్క చేయకుండా కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏక మధ్యాహ్నం 3 గంటల తరువాత మరోసారి విచారణ చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం విచారణ లో న్యాయమూర్తి రెండు వైపులా వాదనలను విని ఆదేశాలను జారీ చేయనున్నారు.
Tags:    

Similar News