హఫీజ్ పేట భూములపై కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాక్

Update: 2021-03-31 02:53 GMT
హఫీజ్ పేట భూములు.. వక్ఫ్ బోర్డువి అంటూ.. ప్రభుత్వ భూములు అంటూ దీనిపై చాలా ఆరోపణలున్నాయి. సర్వే నంబర్ 80లోని 140 ఎకరాలు వివాదాస్పదంగా ఉన్నాయి. వీటిని చాలా మంది కొని అటూ ఇటూ మార్చేశారు.

ఇటీవలే ఈ భూముల కోసం సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసి ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ కేసుల్లో ఇరుక్కొని జైలుకు కూడా వెళ్లారు. కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ లో సర్వే నంబర్ 80లోని వివాదాస్పద భూములపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. సర్వే నంబర్ 80లోని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని హైకోర్టు ధర్మాసనం తేల్చింది. సర్వే నంబర్ 80లోని భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినది అని తెలిపింది.

ఈ క్రమంలోనే పిటీషనర్లకు రూ. 4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 50 ఎకరాలు ప్రవీణ్ రావు సహా యజమానుల పేరిట నమోదు చేయాలని సూచించింది.

అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. హఫీజ్ పేట పేట భూములను వదులుకోకూడదని డిసైడ్ అయ్యింది.

హఫీజ్ పేట భూ వివాదంలోనే ప్రవీణ్ రావు సహా కొంతమందిని కిడ్నాప్ చేసి అఖిలప్రియ ఇరుక్కున్న సంగతితెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్ రావుకే అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది.
Tags:    

Similar News