బాబు నిర్ణ‌యానికి కోర్టు బ్రేకేసింది

Update: 2016-04-27 10:42 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్సీ - ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ గా కారెం శివాజీని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నియమించటంపై హైకోర్టు స్టే విధించింది. కారెం శివాజీపై అనేక‌ క్రిమినల్ కేసుల ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టులో ప్రసాద్ బాబు అనే వ్య‌క్తి పిటిషన్ దాఖ‌లు చేశారు. శివాజీ నియామ‌కాన్ని ఖ‌రారు చేసిన‌ జీవో నెం 45ను సవాల్ చేస్తూ కారెం శివాజీపై అనేక క్రిమినల్ కేసులున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలు సమర్పించాలని కారెం శివాజీ - ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 7కి  వాయిదా వేసింది.

మాల‌మహానాడు నేత అయిన కారెం శివాజీని గ‌త వారంలో క‌మిష‌న్ చైర్మ‌న్‌ గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నియ‌మించారు. ఈ స‌మ‌యంలోనే మందకృష్ణ మాదిగ స‌హా ప‌లువురు నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఓట‌మిపాల‌యిన వ్య‌క్తికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారంటూ బాబు తీరును త‌ప్పుప‌ట్టారు. ఇదిలాఉండ‌గా చంద్ర‌బాబు చేప‌ట్టిన నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో రెండో ద‌శ‌లో ఇలాంటి అడ్డంకి ఎదురుకావ‌డం వ‌ల్ల పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News