టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై పెట్టిన నిర్భయ కేసు కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది.
నర్సిపట్నం మున్సిపల్ కమిషనర్ ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయ్యన్నపై నమోదైన ఈ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరో వైపు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు , నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపైనా హైకోర్టులో విచారణ జరిగింది. వారిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు.
టీడీపీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై ఇటీవలే ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై కేసు పెట్టింది. తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. అనంతలక్ష్మిని అడ్డుకొని తన భర్తను తన దరికి చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో యనమల, నిమ్మకాలయకు ఊరట లభించింది.