మూడు రాజధానులపై స్టే ఇచ్చిన హైకోర్టు ... ఏపీ సర్కార్ కి బిగ్ షాక్ !

Update: 2020-08-04 15:30 GMT
ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. రాజధానిని వికేంద్రీకరిస్తూ ఏపీ అసెంబ్లీలో పాసైన బిల్లును శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. అయితే , పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో అమరావతి నుండి రాజధానిని విశాఖకి వీలైనంత త్వరగా మార్చాలని ప్రభుత్వం అన్ని పనులని సిద్ధం చేస్తుంది. అయితే , ఈ తరుణంలోనే మూడు రాజధానుల బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ల పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సమయంలోనే ఏపీ హైకోర్టు మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 వరకూ స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు లాయర్లు కోరారు. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. దీనితో ఆగస్టు 15 లోపు విశాఖకు రాజధానిని తరలించాలని చూస్తున్న వైసీపీ సర్కార్ కి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
Tags:    

Similar News