ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సెక్యురిటీ భారీగా పెంచేశారు. జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. సీఎం నివాసంతో పాటు.. ఆ చుట్టుపక్కల మొత్తం పోలీసు డేగ కన్ను ఉండేలా ప్లాన్ చేశారు.
జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తనిఖీ నిర్వహించారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి దగ్గర్లోని 35 ప్రాంతాలను గుర్తించారు. అన్నిచోట్ల 90 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి పని తీరును సమీక్షించారు.
ఇవే కాకుండా సీఎం నివాసం వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. అనుక్షణం బాంబ్ డిస్పోజల్.. డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సెక్యురిటీని నిర్వహించాలన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సెక్యురిటీతో తాడేపల్లిలోని జగన్ నివాసం హైసెక్యుర్డ్ ప్రాంతంగా మారిందని చెప్పాలి.