పెద్ద నోట్ల రద్దు తాలుకు ఎఫెక్ట్ ఇపుడు ప్రజలను దాటి పార్టీల వరకు చేరిపోయింది. సామాన్యులు చాంతాడంత క్యూలలో నిల్చొని ఉండటంతో పార్టీ కార్యాలయాల వైపు మొహం చూపే నాథుడే కరువయ్యాడు. అదే సమయంలో పార్టీ సభ్యత్వాలు - సమీక్షలకు నేతలను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వివిధ కార్యక్రమాలతో నిత్యం రద్దీగా ఉండే పార్టీల కార్యాలయాలు పెద్దనోట్ల రద్దుతో వెలవెలబోతున్నాయి. సొంత పార్టీ కార్యాలయాలకు రావడం మానేశారు. అధికార టీఆర్ ఎస్ - ప్రతిపక్ష కాంగ్రెస్ - టీడీపీ - బీజేపీ - వైసీపీ పార్టీలు ఏవైనా ప్రజల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
పెద్ద నోట్ల రద్దు అధికార టీఆర్ ఎస్ పార్టీపై భారీగా పడిందని అంటున్నారు. టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణభవన్ కు రోజు ఎంతో మంది నాయకులు - కార్యకర్తలు వస్తుంటారు. నోట్ల రద్దుతో నాయకులు - కార్యకర్తలు రావడం మానేశారు. ఆ పార్టీ నాయకత్వం ముఖ్యమైన కార్యక్రమాలను రద్దు చేసుకోవడం గమనార్హం. జిల్లాలకు కమిటీలు వేయాలని నిర్ణయించినా నోట్ల రద్దుతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంది. కొత్త జిల్లాల్లో భారీ ఎత్తున్న సభలు నిర్వహించి - రెండున్నరేళ్ల పాలన సందర్భంగా డిసెంబర్ 2న హైదరాబాద్ లో భారీ సభ నిర్వహించాలని టీఆర్ ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ సభలకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సభలు నిర్వహిస్తే వాటికి లెక్కలు చూపించాల్సి ఉంటుందన్న భయంతో వెనక్కితగ్గినట్టు తెలిసింది. దీంతోపాటు పార్టీ పదవులు - నామినేటెడ్ పోస్టుల భర్తీని నిలుపుదల చేసింది. వాటన్నింటినీ డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ ...హైదరాబాద్ లో ఉండే నాయకులు తప్ప జిల్లాల నుంచి ఎవరూ రావడం లేదు. ఇప్పటికే విద్యార్థి - రైతు గర్జనలతో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ...నాయకులు రాకపోవడంతో సమీక్షలు నిర్వహించలేకపోతున్నది. మండల - తాలుకా - జిల్లా నాయకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఖర్చులకు డబ్బుల్లేక చోటామోటా నాయకులు కూడా రావడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు తెలిపారు. ఒకవైపు రైతు భరోసా యాత్రలు చేస్తున్న టీడీపీ...మరోవైపు పార్టీ సభ్యత్వాన్ని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. నోట్ల ప్రభావంతో టీడీపీ సభ్యత్వ నమోదు మందగించింది. టీడీపీ సభ్యత్వ రుసుం రూ 100 కావడంతో ప్రతి ఒక్కరూ ఐదు వందలు - వెయ్యి నోట్లు తెస్తున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చే నాయకులు - కార్యకర్తలు సంఖ్య తగ్గిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బీజేపీ...టీడీపీ పొత్తు ఉండడంతో నోట్ల రద్దు గురించి మాట్లాడేందుకు టీడీపీ నాయకులు ఆసక్తి చూపడం లేదు. ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశాలు నిర్వహించడం తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర బీజేపీ పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలనే కూతుహలం ఉన్నా... ప్రజలు పడుతున్న కష్టాలతో ఆ పార్టీపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడానికి నాయకులు ముఖం చాటేస్తున్నారు. కార్యాలయంలో సిబ్బంది తప్ప అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. పార్టీ బలంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నాయకులు కూడా రావడం లేదని పార్టీ కార్యాలయవర్గాలు చెబుతున్నారు. బయటకు మాత్రం మంచి నిర్ణయం అని చెబుతున్నారు. కార్యాలయం బయట జరిగే వివిధ వేదికల ద్వారా నోట్ల రద్దును సమర్థించుకునే పనిలో నేతలు పడ్డారు. అదేవిధంగా వైసీపీ కార్యాలయం పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు నోట్ల రద్దుపై జగన్ మంచి నిర్ణయమని పేర్కొన్నా...ప్రజల కష్టాలు కూడా ఆపార్టీని వెంటాడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/