రుషికొండ తవ్వకాల మీద హై కోర్టు షాకింగ్ కామెంట్స్

Update: 2022-10-13 10:24 GMT
విశాఖపట్నంలోని  రుషికొండ మీద అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అని హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రుషికొండ వద్ద తవ్వకాల విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తున్నట్లుగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కేంద్ర కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయడానికి కమిటీ వేస్తే ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అని ప్రశ్నించారు.

అంతే కాదు అక్కడ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయన్న పిటిషన్ల అభ్యంతరాలను కూడా ముందుంచి కోర్టు ప్రశ్నించింది. తవ్వకాలకు కేవలం  9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కె ఎస్‌ మూర్తి, అశ్వినీ కుమార్  హైకోర్టుకు తెలిపారు.

దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే అలాంటిది ఏమీ లేదని, అనుమతి ఉన్న మేరకే తవ్వకాలు జరుపుతున్నామని చెప్పారు.

దాని మీద కూడా హై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గూగుల్ మ్యాపులు కూడా  అబద్ధాలు చెబుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అభివృద్ధి పేరిట కొండలను తవ్వుతున్నామని చెబుతున్నారు కదా, మరి  అదే అభివృద్ధి కోసం పాదయాత్రలు చేస్తే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని,  సర్కార్ ఈ ద్వంద్వ నీతి ఏంటి అని కూడా నిలదీసింది.

అయితే పూర్తి వివరాలతో తాను అఫిడవిట్ దాఖలు చేస్తామని అంతవరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టుని కోరడంతో ఈ కేసు విచారణ నవంబర్ 3వ తేదీకి వాయిదా పడింది. ప్రభుత్వం వేసిన అఫిడవిట్ తరువాతనే నిజానిజాలు ఏంటి అన్నది తేలుస్తామని హై కోర్టు చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.

మొత్తానికి చూస్తే రుషికొండ వ్యవహారంలో హై కోర్టు తాజా కామెంట్స్ మాత్రం సర్కార్ కి కొంత షాకింగ్ గానే ఉన్నాయని అనుకోవాలి. మరి ప్రభుత్వం ఏ విధమైన అఫిడవిట్ దాఖలు చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News