క్షేత్ర స్థాయిలో వైసీపీ శ్రేణుల ఉత్సాహం వైసీపీ సర్కారుకు తలవంపులు తెస్తోంది. జగన్ పై ఉన్న ప్రేమ అభిమానాన్ని చాటుకోవడంలో వైసీపీ శ్రేణులు చేస్తున్న అత్యుత్సాహం, తప్పులు అంతిమంగా సీఎం జగన్ కు తలనొప్పులు తెస్తోంది.
తాజాగా హైకోర్టులో ఇదే విషయంపై జగన్ సర్కారు కు ఇబ్బంది కర పరిస్థితి ఎదురైంది. పంచాయతీ కార్యాలయాలపై సీఎం జగన్ ఫొటోలను కొందరు వైసీపీ అభిమానులు, వైసీపీ సర్పంచ్ కింది స్థాయి నేతలు ముద్రించారు. రాష్ట్రానికి సీఎం కావడంతో ఆయన ఫొటోలను సంక్షేమ పథకాలను పంచాయతీ ఆఫీసులపై చిత్రించారు.
అయితే ఈ ఫొటోలపై కొందరు హైకోర్టుకెక్కారు. తాజాగా పంచాయతీ కార్యాలయాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకు ముద్రించారని వైసీపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
దీనికి సమాధానం ఇచ్చిన ప్రభుత్వం తరుఫు లాయర్ ‘సీఎంగా జగన్ రాజ్యాంగ పదవి లో ఉన్నారని..అందుకే ముద్రించి ఉండవచ్చు’ అని సమాధానమిచ్చారు.
లాయర్ సమాధానం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధాని మోడీ ఫొటోను పార్లమెంట్ మీద పెట్టారా? చీఫ్ జస్టిస్ బొమ్మ సుప్రీం కోర్టు మీద పెట్టారా అని నిలదీసింది. ఇలాంటి చేయకూడదంటూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.