మోడీకి భూటాన్ అత్యున్న‌త పుర‌స్కారం.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

Update: 2021-12-17 15:30 GMT
మ‌న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప‌క్క‌నే ఉన్న భూటాన్ ప్ర‌భుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పో' ('నాడగ్ పెల్ గి ఖోర్లో'- స్థానిక భాషలో) పేర్కొనే ఈ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్చుక్.. మోడీకి బహుకరించాలని సూచించినట్లు తెలిపింది.

కరోనా విపత్తు వేళ త‌మ దేశానికి మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ 'ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పో' అవార్డును అందిస్తున్నట్లు భూటాన్ ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. భూటాన్ ప్రజల తరఫున మోడీకి శుభాకాంక్షలు.

ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అర్హులు. ఆధ్యాత్మిక భావాలు ఉన్న గొప్ప వ్యక్తి మోడీ. ఈ అవార్డు బహుకరణ నేపథ్యంలో మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. అని ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆదేశ ప్ర‌భుత్వం పేర్కొంది. ఇక‌, భూటాన్ నేషనల్ డే సందర్భంగా మోడీకి ఈ అవార్డు బహుకరించనున్నారు.

అయితే.. ఇలా భూటాన్ ప్ర‌ధాన‌మంత్రి.. మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి అవార్డు ప్ర‌క‌టించారో.. లేదో.. క్ష‌ణాల్లో నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ``బాగుంది మోడీజీ.. దేశంలో కొన్ని ల‌క్ష‌ల మంది క‌రోనా బాధితులు ఇంకా .. కోలుకోలేదు. ఉద్యోగాలుపోయి.. ఉపాధాలు పోయి నానా తిప్పులు ప‌డుతున్న‌వారు కోట్ల‌లో ఉన్నారు.

మీరు మాత్రం స‌న్మానాలు చేయించుకుంటున్నారు. ఇంట్లోఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత‌.. అంటే ఇదేనా సారూ!`` అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మ‌రి ఇది కూడా నిజ‌మే క‌దా! దేశం ఇంకా క‌రోనా విప‌త్తు నుంచి నిజంతా తేరుకుందా? అంటే.. ప్ర‌శ్న‌లే స‌మాధానాలుగా క‌నిపిస్తున్నాయి.
Tags:    

Similar News