ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం సృష్టించింది. ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎన్నడూ నమోదుకానీ రీతిలో రికార్డ్ కేసులు అయ్యాయి. నిన్నా మొన్నటి వరకు రోజుకు 2500 వరకు నమోదైన కేసులు.. తాజాగా 5వేలు దాటడం ఏపీలో పరిస్థితికి అద్దం పడుతోంది.
ఏపీలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 5041 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఏకంగా 56 మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 642కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,650 కి చేరింది.
మొత్తం 31,148 శాంపిల్స్ ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 26,118గా ఉంది. ఇప్పటివరకు 22,890 మంది కరోనా నుంచి కోలుకోగా.. 642 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఏపీలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల్లోనూ రోజుకు 1000దాకా నమోదు అవుతుండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న కేసులు 1000 దాటడం చేయిదాటిపోయేలా పరిస్థితి కనిపిస్తోంది.శాంపిల్స్ పెంచడంతో కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అందరూ భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.