పట్టుమని పది రోజులే అయ్యాయి. ప్రమాణస్వీకారం చేసిన రోజు.. ఆ తర్వాత రోజు.. మధ్యలో సెలవులు లాంటివి తీస్తేస్తే జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పది రోజులు కూడా కానట్లే. ఇలాంటివేళ..కొత్త మంత్రులతో కొలువు తీరిన తొలి కేబినెట్ ఎలా సాగుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం కాదు.. వరుస పెట్టి తీసుకున్న నిర్ణయాలతో సర్ ప్రైజ్ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి.
తొలి కేబినెట్ సమావేశంలో ఇన్ని నిర్ణయాలా? అంటూ నోరెళ్లబెట్టేలా ఆయన వ్యవహరించారు. ఎంత పెద్ద రివ్యూ మీటింగ్ అయినా మహా అయితే గంట.. లేదంటే గంటన్నరకు మించి ఉండని వేళ.. ఏకంగా ఐదున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో జగన్ తానేం చేయాలన్న విషయంపై తనకున్న స్పష్టతను చెప్పేశారని చెప్పాలి.
పాదయాత్రలోనూ.. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల అమలు విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను తాజా కేబినెట్ మీటింగ్ లో జగన్ ప్రదర్శించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. పెండింగ్ అంశాలపై ఫటాఫట్ అన్నట్లుగా ఇష్యూలు తేల్చేయాలన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పాలి.
ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దుకు ముందడుగు వేసేలా నిర్ణయంతో పాటు.. జులై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి 27 శాతం మధ్యంతర భృతిని ఓకే చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏడాదికోసారి రూ.15వేలు చొప్పున అందించేఅమ్మ ఒడిని జనవరి 26 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీకి సంబంధించి రూ.2వేల కోట్లు తక్షణమే విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు.
తొలి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల పరంపరను చూస్తే.. పాలనలో జగన్ స్పీడ్ కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. తొలి సమావేశంలోనే ఇన్ని నిర్ణయాలు తీసుకోవటం రికార్డు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. జగన్ పాలనా శైలి.. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల మీద పడటం ఖాయమన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేయటం గమనార్హం.
కేబినెట్ సమావేశంలో రంగాల వారీగా తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే..
రైతులు..
+ 2014 నుంచి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ రూ.2వేల కోట్లు వెంటనే విడుదల
+రైతు యూనిట్ గా ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం
+ రూ.2వేల కోట్లతో విపత్తుల సహాయ నిధి
+ రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి
+ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు
+ ఒక్కో రైతుకు 5 జీవాలు, 5 పశువులకు ఉచిత బీమా
+ పంటరుణాలకు వైఎస్ ఆర్ వడ్డీలేని రుణాల పథకం
+ రైతులకు ఉచిత బోర్ల తవ్వకం కోసం 200 రిగ్‌ల కొనుగోలు
+ రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం
వైద్యం
$ ఆసుపత్రి సలహా సంఘం ఛైర్మన్లుగా ఎమ్మెల్యేలు
$ ఫోన్ చేసిన 20 నిమిషాల్లో 104 - 108 వచ్చేలా చర్యలు
$ ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
ఉద్యోగులకు..
# భాగస్వామ్య పింఛను పథకం రద్దు
# కార్యాచరణకు ఆర్థికమంత్రి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
# 1 నుంచి ప్రభుత్వోద్యోగులకు 27% తాత్కాలిక భృతి
# దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.815 కోట్ల మేర అదనపు భారం
# 4.24 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
# ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం
వేతనాల పెంపు
@ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో రిసోర్సుపర్సను, యానిమేటర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం
@ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.11,500కు, అంగన్‌వాడీ ఆయాల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు
@ హోంగార్డులకు తెలంగాణలో చెల్లిస్తున్న వేతనం కంటే రూ.వెయ్యి ఎక్కువ ఇవ్వాలని నిర్ణయం
@ అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇచ్చే అంశంపై ఆయా శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు
@ ఆశావర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
ఆర్టీసీ
- సర్కారు చేతికి ఆర్టీసీ!
- విలీనానికి మంత్రివర్గ ఉపసంఘం
- ఈ ప్రక్రియపై అధ్యయనానికి నిపుణుల కమిటీ.
విద్య
+ జనవరి 26 నుంచి అమ్మఒడి
+ బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు
+ ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద - మధ్య తరగతి వారికి తప్పనిసరి
+ దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు
ఒప్పందాల సమీక్ష
+ ఇప్పటివరకూ చేసుకున్న విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష
+ అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు
+ ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానం రద్దు
+ గ్రామ వలంటీర్లకు విద్యార్హతలు ఖరారు
ఇళ్లు
= వైఎస్ ఆర్ పేరిట నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం
= ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ