బ్రేకింగ్: జగన్ మేనిఫెస్టో.. వరాల జల్లు..

Update: 2019-04-06 05:51 GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడవు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అమరావతిలోని తాడేపల్లి గూడెంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో విడుదల చేశారు.  రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారిపై వరాల జల్లు కురిపించారు. ప్రజల సంక్షేమం - రాష్ట్ర అభివృద్ధి - ఉజ్వల భవిష్యత్ లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ తన మేనిఫెస్టోను శనివారం ఉదయం విడుదల చేశారు. ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ శుభదినాన మేనిఫెస్టోను విడుదల చేయడం సంతోషకమరని వైఎస్ జగన్ అన్నారు.  మేనిఫెస్టోతో ఏపీలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని.. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయమని స్పష్టం చేశారు.

+ వైఎస్ జగన్ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోని కీలక అంశాలు..

*ప్రతీ రైతుకు కుటుంబానికి రూ.50వేల పెట్టుబడి..

* పంట వేసే సమయానికి -  మే నెలలోనే రూ.12500 చొప్పున పంట సాయం ఇస్తాం

* పంట బీమాను రైతులకు కల్పించి.. బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది.

* కౌలు రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం.. వారి పంట నష్టం వాటిల్లితే పరిహారం

*రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

*దళిత - బీసీ - ఎస్టీలకు 70వేల వరకూ కార్పొరేషన్ల ద్వారా రుణాలు

* రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

*అక్వా రైతులకు యూనిట్ రూపాయికే విద్యుత్

* రైతులకు రూ.12500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు

*ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా

*రైతులకు సున్నా వడ్డీకే రుణాలు

*వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స

* అన్ని రకాల వ్యాధుల్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తాం..

*ప్రభుత్వ ఆసుపత్రుల దశాదిశా మారుస్తాం

*కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేల పింఛన్

*వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు

* పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు

*అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు

* మూడు దశల్లో మద్యపాన నిషేధం.

*ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ

*ఐదేళ్లలో రూ.25లక్షల ఇళ్లు నిర్మిస్తాం

*శ్రీవారి సన్నిధిలో తలుపులు తీసే అవకాశం గొల్లలకు

*ఎస్సీ - ఎస్టీ అమ్మాయిలకు పెళ్లికానుకగా రూ. లక్ష ఆర్థిక సాయం

* బీసీ అమ్మాయిలకు రూ.50వేల పెళ్లి సాయం

* ప్రతీ బీసీ ఉప కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్

*కాపు కార్పొరేషన్ కు రూ.2వేల కోట్ల కేటాయింపు

*శాశ్వత ప్రాతిపదికన బీసీ - ఎస్సీ కార్పొరేషన్లు

*అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు

*అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం

*ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తాం..

*రైతుల సంక్షేమానికి వైఎస్ ఆర్ భరోసా

*డ్వాక్రా మహిళల కోసం వైఎస్ ఆర్ ఆసరా

*వృద్ధులకు ప్రతీనెల రూ.2వేల పింఛన్

*కొత్తగా రూ.25లక్షల ఇళ్ల నిర్మాణం

*విద్యార్థులకు ఉచితంగా చదువును చెప్పించడానికి రూపొందించిన అమ్మఒడి

+పాదయాత్రలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు నవరత్నాల్లో చెప్పిన అంశాలన్నింటిని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాష్ట్రంలోని పేద - మధ్య తరగతి కుటుంబాన్ని వెలుగులు నింపేలా ‘నవరత్నాల’ పాటుగా రాష్ట్రాభివృద్ధికి ఓ సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేశారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.



Tags:    

Similar News