ల‌గ‌డ‌పాటి స‌ర్వే హైలైట్స్ !

Update: 2018-12-04 14:31 GMT
తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల కంటే స‌ర్వేల పేరిట‌ ల‌గ‌డ‌పాటి ఇస్తున్న‌ ట్విస్టులు ఎక్కువ మీడియా అటెన్ష‌న్‌ను డ్రా చేస్తున్నాయి. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం అంటూనే కొంద‌రి పేర్లు ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నెంబ‌ర్లు త‌ప్ప దాదాపు స‌ర్వేను వెల్ల‌డించేశారు. మొన్న హంగ్ రాద‌న్న ల‌గ‌డ‌పాటి ఈరోజు దానికీ ఛాన్సుండే అవ‌కాశం ఉంద‌న్నారు. ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించిన అంచ‌నాలు ఇలా ఉన్నాయి.

ఇండిపెండెట్లు
నారాయ‌ణ్ పేట్ - శివ‌కుమార్ రెడ్డి (స్వ‌తంత్ర‌)
భోద్ - అనిల్ జాద‌వ్ (కాంగ్రెస్ రెబ‌ల్‌)
ఇబ్ర‌హీం ప‌ట్నం - మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్ రెబ‌ల్‌- బీఎస్పీ)
బెల్లంప‌ల్లి - జి.వినోద్ (టీఆర్ఎస్ రెబ‌ల్‌)
మ‌క్త‌ల్ - జ‌లంద‌ర్‌రెడ్డి (టీఆర్ఎస్ రెబ‌ల్‌)

జిల్లాల వారీగా అంచ‌నాలివే
టీఆర్ఎస్ ఆధిక్య‌త  ఉన్న జిల్లాలు - నిజామాబాద్; మెద‌క్‌, వ‌రంగ‌ల్‌
ప్ర‌జాకూట‌మి ఆధిక్య‌త ఉన్న జిల్లాలు - ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి
హోరాహోరీ -  కరీంనగర్, మహబూబ్ నగర్‌

 పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి ప‌రిస్థితులు మార‌తాయ‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి 68.5 శాతం లోపు పోలింగ్ న‌మోదైతే తెలంగాణ‌లో హంగ్ ఏర్ప‌డుతుందని విశ్లేషించారు. పోలింగ్ శాతం అంత‌కుమించి పెరిగితే ప్ర‌జాకూట‌మి విజ‌యం సాధిస్తుంద‌ని వివ‌రించారు. ఇందులో బీజేపీకి ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొన‌డం విస్మయంగా ఉంది. హైద‌రాబాద్ ఫ‌లితాల్లో ఎప్ప‌టిలాగే ఎంఐఎంది పైచేయి అని ల‌గ‌డ‌పాటి స్ప‌స్టంచేశారు. ఓవ‌రాల్ చూస్తే కాంగ్రెస్ వైపు జ‌నం చూస్తున్నార‌ని చెప్పారు. తెలుగుదేశం పొత్తు కాంగ్రెస్ ఉప‌యోగ‌ప‌డింద‌ని ఆయ‌న విశ్లేషించారు.
Tags:    

Similar News