అమ‌రావ‌తిలో మోడీ ఏం మాట్లాడారు..?

Update: 2015-10-22 10:04 GMT
అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ ప్ర‌పంగించారు. ఆయ‌నేం మాట్లాడారో ఆయ‌న మాట‌ల్లోనే..

=  సంపద సృష్టికి.. జన జీవనానికి అనుగుణంగా ఉండేలా కొత్త నగరాలు ఉండాలి.

=  నగరాలు ఆధునిక హంగులతో ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి.

=  కొత్త నగరాలను నిర్మించేటపుడు ఎలాంటి సమస్యలు కలుగుతాయో జపాన్ మంత్రి తెలిపారు.

=  నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలున్నాయి. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. భూకంపం కార‌ణంగా న‌ష్ట‌పోయిన క‌చ్ ప‌ట్ట‌నాన్ని పున‌ర్మిర్మించా.

=  ప్రజల మద్ధతు ఉంటే ఏదయినా సాధ్యం. 

=  ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉంటే ప్రపంచంలోనే శక్తివంతమయిన రాష్ట్రాలవుతాయి.

=  బీజేపీ హయాంలో జ‌రిగిన రాష్ట్రాల విభజన సామరస్య వాతావరణంలో జరిగితే.. అందుకు భిన్నంగా ఏపీ విభ‌జ‌న జ‌రిగింది.

=  తెలుగువారి తెలివి అమోఘమం.దానిని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది.

=  విభజన సమయంలో పేర్కొన్న విధ్యాసంస్థల్లో కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. మిగతావాటికి అతి త్వరలోనే మంజూరు చేస్తాం.

=  పార్లమెంటు , యమునా నది నుంచి మట్టి, నీరు తెచ్చా.
 
=  మట్టి, నీరు తేవడంతో రాజధాని అభివృద్ధి ప్రతీ అడుగులోనూ మేం తోడుగా ఉంటాం.

=  రాష్ట్రాన్ని విభజించిన వారు ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తన్నారు. వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి.

=   మోదీ, చంద్రబాబు ద్వయం అభివృద్ధికి సూచిక అనే మాటను నిజం చేస్తా.

Tags:    

Similar News