‘అమ్మ’కే కాదు ‘దీదీ’కి అదే పరిస్థితి

Update: 2016-04-09 08:06 GMT
రాజకీయాల్లో ఒకేలాంటి పరిస్థితులు కాస్తంత అరుదని చెప్పాలి. తాజాగా అలాంటి సిట్యూవేషనే ఇద్దరు అధినేత్రులకు ఎదురుకావటం విశేషం. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల పోరులో తమిళనాడు ముఖ్యమంత్రి.. అమ్మగా సుపరిచితురాలైన జయలలితపై ఒక హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సిట్యూవేషన్ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఎదుర్కొంటున్నారు.

ఆర్కే నగర్ బరిలో దిగిన అమ్మ జయలలితపై పలు సామాజిక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న దేవి అనే హిజ్రా పోటీకి దిగటం ఆసక్తికరంగా కాగా.. దీదీ మమతా బెనర్జీ పోటీ చేస్తున్న కోల్ కతాలోని భవానీ నగర్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా దీదీ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఆమెపై పోటీకి కాంగ్రెస్ అభ్యర్థి.. మాజీ కేంద్రమంత్రి దీపా దాస్ మున్షీ.. బీజేపీ తరఫున నేతాజీ మనమడు చంద్రకుమార్ బోస్ లు పోటీ చేస్తుండగా.. లోక్ జనశక్తి పార్టీ తరఫున బాబీ హాల్డర్ అనే హిజ్రా పోటీకి దిగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News