హిజ్రా అయితే వైద్యం చేయరా...?

Update: 2019-10-03 09:04 GMT
హిజ్రా అయితే వైద్యం చేయరా...?
  • whatsapp icon
ఇప్పటికే దేశంలో జనాలు కులాలు - మతాలు - ఆడ - మగ - భాషలు - ప్రాంతాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. దేశంలో కొంతమంది ప్రజలు ఇంకా అణచివేతకు గురౌతూనే ఉంటున్నారు. మనం తరచూ ఎక్కడో ఒకచోట ప్రాంతీయ గొడవలు లేదంటే మత ద్వేషాలు - తక్కువ కులం అని చెప్పి హేళన చేయడాలు చూస్తూనే ఉంటున్నాం. ఇంక హిజ్రాల సంగతైతే చాలా దారుణంగా ఉంటుంది. వాళ్లలో వాళ్ళకి తప్ప ఇంకెవరు వాళ్ళకి కనీస మర్యాదని కూడా ఇవ్వడంలేదు.  ఇలాంటి సంఘటనే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

చెన్నై తిరుత్తణి పెరియార్ నగర్ లో నివసిస్తున్న కావ్య అనే 40 సంవత్సరాల హిజ్రా జ్వరం - వాంతులు - విరోచనాలతో బాధపడుతూ దగ్గర్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ రెండు గంటలు వెయిట్ చేసినా డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో ఆమె కూడా వచ్చిన కొంతమంది హిజ్రాలు చీఫ్ డాక్టర్ రాధికను వైద్యం ఎందుకు చేయరని నిలదీశారు. అయినా ఆ డాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో ఆసుపత్రి ముందే నిరసనకు  చేశారు. ఇంతలో అక్కడకి వచ్చిన జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ దయాలన్ సమస్య తెలుసుకుని ఆ హిజ్రాకు వెంటనే వైద్యం చేయాలని ఆదేశించారు.  


Tags:    

Similar News