ఫైనల్ డిబేట్: ఒకరిపై ఒకరు తిట్టేసుకున్నారు

Update: 2016-10-20 06:34 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య జరగాల్సిన మూడు డిబేట్లలో చివరి డిబేట్ కొద్దిసేపటి క్రితం (ఉదయం 8 గంటల ప్రాంతంలో) ముగిసింది. గడిచిన రెండు డిబేట్లకు తగ్గట్లే మూడో డిబేట్ కూడా హోరాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అధ్యక్ష పదవికి ఎంపికైతే తామేం చేస్తామన్న అంశంపై ట్రంప్.. హిల్లరీలు ఇద్దరు తమ వాదనల్ని వినిపించారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకున్నారు. తమకు దక్కిన చివరి అవకాశాన్ని ఏమాత్రం విడిచి పెట్టకూడదన్నట్లుగా ఇరువురు నేతలు.. పోటాపోటీగా ఒకరిపై ఒకరు మాటల దాడికి ప్రయత్నించారు.

డిబేట్ సందర్భంగా హిల్లరీ.. ట్రంప్ లు ఏమేం మాట్లాడారన్న విషయాన్ని చూస్తే..

హిల్లరీ వాదన ఏమిటంటే..

= అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటాం. అన్ని రంగాల్లోనూ పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తాం.

= ట్రంప్ కు దేశ నిఘా వర్గాల మీద నమ్మకం లేదు. దేశ నిఘా అధికారుల కంటే ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ నే ఎక్కువగా నమ్ముతారు.

= అయితే..అణు ప్రయోగం చేసే వారు మాత్రం ట్రంప్ ను విశ్వసించటం లేదు. శ్వేతసౌధంలో తన కీలుబొమ్మ ఉండాలని పుతిన్ అనుకుంటున్నారు.

= వికీలీక్స్ వెనుక రష్యా ఉంది. అమెరికా ప్రభుత్వ మొయిల్స్ ను రష్యా హ్యాక్ చేస్తోంది.

= ప్రజల పక్షాన సుప్రీంకోర్టు ఉండాలి.. కార్పొరేట్ల వైపుకాదు. చట్టంలోని లొసుగులను సవరించాల్సిన అవసరం ఉంది.

= కార్పొరేషన్లు న్యాయంగా వేతనాలు చెల్లించాలని మేం ఆదేశిస్తాం. ఆర్థికవేత్తల్ని నిరంతరం చర్చించే మిడిల్ అవుట్ గ్రోత్ ను మేం సాధిస్తాం.

= మేం లక్షలాది ప్రజలను సిరియాలోవదిలిపెట్టాం. మేం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నం. ఈ ఒప్పందం సిరియాకు సాయం చేయటానికి మంచి డీల్ గా ఉండాలనిభావిస్తున్నం. రష్యా..సిరియా ఇరు దేశాల ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి.

= ఇరాక్ ముట్టడిని ట్రంప్ సమర్థించటం లేదని మరోసారి స్పష్టమైంది. కానీ.. మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. ట్రంప్ దాడులకు అనుకూలమని తేలుతుంది.

= మహిళలను అవమానించటం డోనాల్డ్ ట్రంప్ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. ట్రంప్ మహిళల కోసం ఏం చేశారో వింటూనే ఉన్నాం. పలువురు మహిళలు ఇప్పటికే ముందుకు వచ్చి ఆయన చర్యల గురించి వాపోతున్నారు. కనీసం..ఆయన వారికి క్షమాపణలు చెప్పలేదు.

ట్రంప్ వాదన ఏమిటంటే..

= అధికారంలోకి వస్తే చట్టంలో సవరణలు చేస్తాం. ఇప్పుడు దేశంలోకి మత్తు పదార్థాలు వెల్లువలా వస్తున్నాయి. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

= దేశ సరిహద్దుల్ని పటిష్టం చేస్తాం. పన్నులు పెంచాలని హిల్లరీ అనుకుంటున్నారు. దాని వల్ల విపత్తు సంభవిస్తుంది.

= పుతిన్ ను హిల్లరీ ద్వేషిస్తోంది. అలాగే పుతిన్ ఆమెను గౌరవించరు. పుతిన్ కు సంబంధించి నాపై హిల్లరీ చేసిన ఆరోపణల్ని ఆమె నిరూపించగలరా?

 = హిల్లరీ రష్యాను బూచిగా చూపించాలనుకుంటున్నారు. హ్యాక్ చేసింది రష్యానో.. చైనానో ఇప్పటికి గుర్తించలేదు.

 = భారత్ వృద్ధి శాతం 8.. చైనా 7 శాతం వృద్ధిరేటుతో వెళుతున్నాయి. మన వృద్ధిరేటు మాత్రం ఒక శాతం కంటే తక్కువగా ఉంది. మన దేశం వెనుకబడింది. ఉద్యోగాలు కోల్పోయాం.

 = అమెరికాలో ఉద్యోగవకాశాల్ని విపరీతంగా సృష్టిస్తాను. ప్రస్తుతం ఉన్నజీడీపీని 1 శాతం నుంచి 4 శాతానికి తీసుకెళ్తా. దాన్ని ఐదారు శాతానికి పెంచగలనని భావిస్తున్నా. మన ఉద్యోగాల్ని మళ్లీ వెనక్కి తీసుకురావటమే లక్ష్యం.

= అలెప్పో ఒక భయంకరమైన విపత్తు. ఏదైతే జరిగిందో అది చాలా విచారించాల్సిన విషయం. హిల్లరీ క్లింటన్ వల్లే ఇదంతా జరిగింది. ఆమె దాన్లో తలదూర్చకుండా ఉంటే అంతా మంచి జరిగి ఉండేది.

= ఎప్పుడైతే క్లింటన్ వెళ్లిపోతారో.. అప్పుడు ఆమెతోనే అన్నీ ఐఎస్ఐఎస్ కార్యచరణ తగ్గిపోతాయి. మోసుల్ ను ఐసిస్ మళ్లీ అధీనంలోకి తెచ్చుకుంటాయి. మోసుల్ మళ్లీ ఇరాన్ స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి అమెరికా ప్రమేయం చాలా ప్రయోజనకరం.

= నేను మహిళలను గౌరవించినంతగా ఎవరూ గౌరవించలేరు (ట్రంప్ నోటి నుంచి ఈ మాట వచ్చిన వెంటనే డిబేట్ లో పాల్గొన్న ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు) నాపై వచ్చిన లైంగిక ఆరోపణల కథనాలన్నీ అవాస్తవం. కనీసం నా భార్య కూడా క్షమాపణలు చెప్పలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు.

= హిల్లరీ కానీ అధ్యక్షురాలైతే దేశం గందరగోళంలోకిపడిపోతుంది. ఆమె అధికారంలోకి వస్తే పన్నులు భారీగా పెరిగిపోతాయి. పన్నులు తగ్గించటానికి నేను కొత్త ఒప్పందాల్ని తీసుకొస్తా.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News