అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. మొన్న 9/11మృతులకు నివాళులు ఆర్పించేందుకు వచ్చిన అమెరికా అధ్యక్ష డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తూలి పడిపోవటం.. ఆమె కిందపడకుండా పట్టుకున్న భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆమెను అక్కడ నుంచి తరలించటం తెలిసిందే. ఈ ఘటనతో హిల్లరీ ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా హిల్లరీ ఆరోగ్యానికి సంబంధించిన సంచలన వ్యాఖ్య ఒకటి బయటకు వచ్చింది.
ఆమె అనారోగ్యం వెనుక విష ప్రయోగం జరిగి ఉంటుందని..దీని వెనుక రష్యా అధినేత పుతిన్ ఉండి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాలోని ప్రముఖ సైంటిస్టులలో ఒకరైన డాక్టర్ బెన్నెట్ ఒమలు చేసిన ఒక ట్వీట్ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ పాథాలజిస్ట్ అయిన ఆయన.. హిల్లరీ క్లింటన్ కు టాక్సికాలోజిక్ విశ్లేషణ చేయించాల్సిందిగా కోరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.
‘‘ఆమె రక్తంలో విషం ఉండే అవకాశం ఉంది. ట్రంప్.. పుతిన్ లపై నాకు అనుమానంగా ఉంది. వీరిద్దరే ఈ పనికి పాల్పడి ఉండొచ్చు’’ అంటూ ఆయన చేసిన మరో ట్వీట్ పై దుమారం రేగుతోంది. ట్రంప్ మూలాలు రష్యాలో ఉండటం.. ఆ దేశానికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ.. వ్యవహారం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరగనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.