మరో ఆరు రోజుల అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకూ సర్వేలూ - మీడియాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతుందని చెప్పుకుంటూ వచ్చాయి. అయితే ఇంతలోనే అంతా రివర్స్ అయిపోయింది. తాజా పోల్స్ లో హిల్లరీ కాస్త వెనుకంజ వేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెమ్మదిగా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ హిందూ ఆర్గనైజేషన్ హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా ప్రచారం తీవ్రతరం చేసింది. ఈ ప్రచారంలో ఆసక్తికర విషయాలను వెళ్లడిస్తూ వారు దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తోన్న ఇండో - అమెరికన్ ఓటర్లను ప్రభావింతం చేసేలా ఇండియన్ - అమెరికన్ టెలివిజన్ ఛానళ్ళలో ప్రకటనలు ఇస్తోన్న ఈ సంస్థ... హిల్లరీ పాకిస్థాన్ సానుభూతిపరురాలని, ఆమెకు సహాయకురాలిగా పాకిస్థాన్ సంతతి మహిళ సుదీర్ఘకాలం పని చేశారని చెబుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ కు ఆమె బిలియన్ల డాలర్లను సహాయంగా అందజేశారని, అలాగే మిలిటరీ ఎక్విప్ మెంట్ ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించారని ప్రచారం చేస్తోంది.
ఇదే స్థాయిలో విమర్శల హీట్ పెంచిన రిపబ్లికన్ హిందూ ఆర్గనైజేషన్... భారత ప్రధాని నరేంద్ర మోడీ వీసాను హిల్లరీ క్లింటన్ అడ్డుకున్నారని, రాడికల్ ఇస్లాంను సమర్థించే దేశాలు, వ్యక్తుల నుంచి ఆమె విరాళాలు స్వీకరిస్తున్నారని ఆ ప్రకటనల్లో పేర్కొంది. ఇదే క్రమంలో హిల్లరీ క్లింటన్ భర్త - అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పైనా - పాక్ సంతతి సహాయకురాలు హ్యూమా అబెదిన్ పైనా ఈ ప్రకటనల్లో పలు విమర్శలు చేశారు. హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలైతే కశ్మీరును పాకిస్థాన్‌కు ఇవ్వాలని బిల్ క్లింటన్ కోరుకుంటున్నారని వారు వివరించారు. ఈ సంస్థ ప్రకటనలు, ప్రసంగాలు అలా ఉంటే తాజాగా రిపబ్లికన్ హిందూ కొయలిషన్ చీఫ్ శలభ్ కుమార్... హ్యూమా అబెదిన్ నేపథ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. హిల్లరీ అద్యక్షురాలైతే... చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని హ్యూమా అబెదిన్ కు కట్టబెడతారని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/