హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు అస్వస్థతకు తీవ్ర గురయ్యారు. సోమవారం ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్ హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ రావాల్సి ఉంది. బండారు దత్తాత్రేయ మోదీ హయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి గా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గవర్నర్ గా హిమాచల్ ప్రదేశ్ లో ఉంటున్న ఆయన ఇప్పుడు మహిళల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన హైదరాబాద్ కు ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ సన్మానించారు కూడా. ప్రయాణం చేయడంతో ఆయన అలసినట్టు తెలుస్తోంది. ఆయన అస్వస్థతకు గురవడంతో బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ ను ఆస్పత్రికి వచ్చి పరామర్శిస్తున్నారు. పలువురు పార్టీ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయనకు చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారంట. దీంతో ఆయన హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లకుండా హైదరాబాద్ లోనే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు.