హిమాన్షుకి కేసీఆర్ ఇచ్చేప్రయారిటీ ఎంతంటే..?

Update: 2017-03-30 04:36 GMT
ఉమ్మడి కుటుంబాలు పోయి చాలానే ఏళ్లైంది. ఎవరికి వారు.. వీలైనంత వ్యక్తిగతంగా గడపటానికి మక్కువ ప్రదర్శించటం మామూలైపోయింది. అందరం నుంచి నా కటుంబం వరకూ వెళ్లిన స్వార్థం.. ఇప్పుడు ‘నేను’ వరకూ వెళ్లి ఆగింది. తండ్రి..కొడుకు.. తల్లి..కూతురు.. భార్య.. భర్త..అన్నా.. తమ్ముడు.. అక్కా..చెల్లెలు.. ఇలా బంధం ఏదైనా.. ‘‘నా’’ అనే దానికే ప్రాధాన్యత పెరుగుతున్న పాడు రోజులివి. ఇలాంటి వేళలో ప్రముఖల ఇంట్లో పాతకాలం నాటి కుటుంబ వాతావరణం కనిపించటం నిజంగా అభినందనీయం.

మిగిలినవిషయాల్లో నాయకుల్ని వీరగా అభిమానించి.. ఆరాధించే వారంతా.. వారి వ్యక్తిగత జీవితాల్లో అనుసరించే సంప్రదాయ పద్ధతుల్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనమడ్ని గడిపే అవకాశం తక్కువని తరచూ వాపోతుంటారు. నిత్యం కోట్లాది మంది కోసం తపిస్తానని చెప్పే ఆయన.. మనమడ్ని మిస్ అయ్యే విషయాన్నితరచూ ప్రస్తావించటం కనిపిస్తుంటుంది. బాబులాంటి బిజీ పర్సన్ కు ఇలాంటి మిస్సింగ్స్ కూడానా?అని ఆశ్చర్యపోతుంటారు.

మనమడి విషయంలో తరచూ ఓపెన్ అయ్యే చంద్రబాబుకు భిన్నంగా..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మనమడి గురించి పెద్దగా ప్రస్తావించరు కానీ..తన వెంట తిప్పుకుంటూ అతనికిచ్చే ప్రయారిటీ చూస్తేనే విషయం ఇట్టే అర్థమైపోతుంటుంది. అయితే.. బయటకు కనిపించేదాని కంటేనే హిమాన్షును ఎంత డీప్ గా ఇష్టపడతారో తెలిస్తే అవాక్కుఅవ్వాల్సిందే.ఇప్పటి రోజుల్లో..సీఎం స్థానంలో ఉండే వ్యక్తి.. మనమడి కోసం అంత సమయాన్ని వెచ్చించే వైనం ఆశ్చర్యానికి గురిచేయక మానదు.

తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కు హాజరైన హిమాన్షు ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.అందులో..తనకు.. తన తాతకు మధ్యనున్న అనుబంధం గురించి మామూలుగా చెప్పేసినా.. వాటిని విన్న వారంతా మాత్రం కాస్తంత అవాక్కుఅయ్యేలా ఉండటం గమనార్హం. ప్రతిరోజూ తనతో తాతగారు కూర్చుంటారని.. కథలు చెబుతుంటారన్నారు. తామిద్దరం కలిసి సినిమాలు చూస్తుంటామన్న హిమాన్షు.. రోజూ రాత్రి వేళ తాతగారు తనతోనే ఉంటారని చెప్పారు. తనకు ప్రత్యేకంగా ఫేవరేట్ హీరో లేరని.. తన తాతే తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చారు. హిమాన్షు ఆ మాట చెప్పటంలో నూటికి నూటయాభై పాళ్లు న్యాయం ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News