దేశంలో బీజేపీ గెలిచిందే హిందుత్వవాదంపైన.. ఆ హిందూ ఓటు బ్యాంకుపైనే ఇప్పటికీ రాజకీయాలు చేస్తోంది. కొత్త రాష్ట్రాల్లోనూ వారికి అదే ఆయుధం అవుతోంది. హిందుత్వ, జాతీయ భావజాలం అధికంగా ఉండే హిందీ బెల్ట్ లో బీజేపీకి అందుకే ఆదరణ ఉంటోంది. అయితే దక్షిణాదిలో ఈ సెంటిమెంట్ చాలా తక్కువ. అందుకే ఇక్కడ బీజేపీ ఎదగడం లేదు.
కర్నాటక తర్వాత బీజేపీకి ఆయువుగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. అందుకే ఇక్కడ అధికారం కోసం సర్వం ధారపోస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ బీజేపీ నేతలు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ మత ప్రవక్తపై చేసిన కామెంట్స్ తెలంగాణలో చిచ్చు పెట్టాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ నేతల మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి.
ఇక తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్ లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్ ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను ఇక్కడికి రప్పించారని.. ఆయన భాష సరిగాలేదని.. అందుకే స్థానికులు అడ్డుకున్నారు. ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడికి వచ్చారని.. అలాంటప్పుడు గణేషుడి గురించి.. శోభాయాత్ర గురించి మాట్లాడాలని.. రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని తలసాని హితవు పలికారు. బీజేపీ నేతలు హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న బీజేపీ నేతలు తెలంగాణపై దండెత్తి ఇక్కడ విద్వేషాలు పెంచుతున్నట్టుగా అర్థమవుతోంది. స్తానికులే అడ్డుకుంటుండడంతో ఇప్పటికైనా ఈ నేతల వేష, భాషలు మారుతాయో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.