ప్రపంచ వేదికపై హిందీకి వెలుగు.. ఐరాసాలో దక్కిన ప్రాధాన్యం

Update: 2022-06-11 10:38 GMT
రాష్ట్రీయ భాషకు అంతర్జాతీయ వేదికపై ప్రాధాన్యం లభించింది. అంతర్జాతీయ సమావేశ మందిరం ఐక్యరాజ్య సమితిలో  హిందీ భాషకు ప్రముఖ స్థానం ఇచ్చారు. సమితిలోని ముఖ్యమైన సమాచారాన్ని హిందితో సహా అధికార, అనధికార భాషల్లో అందించాలనే తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ ఆమోదించింది. భారతదేశం ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హిందిని చేర్చారు.

మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఈ తీర్మానంలో హిందీ భాష ప్రస్తావన వచ్చిందని, హిందీతో పాటు బంగ్లా, ఉర్దూ భాషల ప్రస్తావన కూడా తీర్మానంలోకి తొలిసారి వచ్చిందని ఐరాస శాశ్వత ప్రతినిధి రాయబారి టీఎస్ త్రిమూర్తి తెలిపారు. ఐక్యరాజ్య సమితీలో ఈ చేర్పులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఐక్యరాజ్య సమితిలోని అంశాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 2018లో Hindi @Un ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రపంచ వేదికగా ఉన్న సమితిలో జరిగే విషయాలను తెలియపరిచేందుకు హిందీ భాష అవసరమని.

ఈ ప్రాజెక్టు లక్ష్యం కోట్లాది ప్రజలు అనేక విషయాలు హిందీలో తెలుసుకుంటారని అన్నారు. ఇందులో భాగంగా యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్ 2018 నుంచే పనిచేస్తుందని, వార్తలు మల్టీ మీడియా సమాచారాన్ని హిందీ భాషలో క్రోడీకరించడానికి అదనపు బడ్జెట్ ను అందిస్తోందని టీఎస్ త్రిమూర్తి పేర్కొన్నారు.

ఐరాసలో ఇప్పటికే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలు అధికారిక భాషలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ కార్యనిర్వాహక భాషలుగా ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు కొనసాగుతున్నాయి. హిందీ బహుభాషా విధానం ఐరాస కీలక విలువల్లో ఒకటి. అందుకే హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నట్లు త్రిమూర్తి తెలిపారు. అయితే తాము ప్రతిపాదించిన  తీర్మానానికి ఆమోదం తెలిపినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

193 దేశాలు పూర్తి కాలపు సభ్యత్వమున్న ఐరాసలో ప్రపంచ భాషల సరసన ఇప్పుడు హిందీ చేరనుంది. ఐక్యరాజ్య సమితిలో జరిగే విషయాలు, సమావేశాల వివరాలు ఇకపై హిందీలో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు వివిధ భాషల్లో ఉండగా వాటిని అర్థం చేసుకునే ఆసక్తి లేకుండా పోయింది. ఇప్పుడు సొంత భాషలోకి రావడంతో ప్రపంచంపై ప్రజలకు అవగాహన పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News