పాక్‌ లో హిందూ అమ్మాయిల కిడ్నాప్‌..

Update: 2017-06-21 12:24 GMT
పొరుగున ఉన్న ముస్లిం దేశ‌మైన పాకిస్థాన్‌ లో మ‌త‌మార్పుడులు ఎక్కువ‌య్యాయి. దీంతో అక్క‌డ హిందువుల సంఖ్య త‌గ్గుతోంది. 1947లో ఆ దేశంలో హిందువులు 23 శాతం ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఆరు శాతానికి ప‌డిపోయింది. మత‌మార్పిడులు - అణిచివేత వ‌ల్లే ఇస్లామిక్ దేశంలో మిగ‌తా మ‌తాల‌కు ఆద‌ర‌ణ కరువైన‌ట్లు తెలుస్తోంది. మైనార్టీలుగా ఉన్న హిందువు అమ్మాయిల‌ను బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లి మ‌త మార్పిడి చేసి, పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికి సంబంధించి తాజాగా ద నేష‌న్ ఆనే ప‌త్రిక ఓ వ్యాసంలో ఈ అంశాన్ని పేర్కొంది.

బ‌ల‌వంతంగా జ‌రుగుతున్న మత మార్పిడుల వ‌ల్లే ఒకప్పుడు మెజారిటీగా ఉన్న హిందువులు ఇప్పుడు మైనార్టీగా మారిన‌ట్లు ద నేష‌న్‌ నివేదిక వెల్ల‌డించింది. పాకిస్థాన్‌ లోని సింధు ప్రావిన్సులో అత్య‌ధిక శాతం హిందువులు ఉన్నారు. కానీ ఇప్పుడు అక్క‌డ ఎక్కువ శాతం నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మైనార్టీలు అయిన హిందువుల‌ను టార్గెట్ చేస్తూ నేరాలు సాగుతున్నాయి. ముఖ్యంగా హిందూ అమ్మాయిల‌ను ఇస్లామ్‌ లోకి మ‌త మార్పిడి చేస్తున్నారు. నిమ్న‌ కులానికి చెందిన హిందువుల‌ను మ‌త మార్పిడుల‌కు ప్రోత్స‌హించ‌గా, అగ్ర కులానికి చెందిన హిందువుల‌ను ఎక్కువ‌గా కిడ్నాప్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మూవ్‌ మెంట్ ఫ‌ర్ సాలిడారిటీ అండ్ పీస్ ప్ర‌చురించిన రిపోర్ట్ ప్ర‌కారం ప్ర‌తి ఏడాది సుమారు వెయ్యి మంది ముస్లిమేత‌ర అమ్మాయిల‌ను ఇస్లామ్‌లోకి మార్చేస్తున్నారు. సింధు ప్రాంతంలో ఇది మ‌రో 20 శాతం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో పాక్‌ లో ఉన్న హిందువులు భార‌త్‌కు వ‌చ్చేందుకు క్యూ క‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News