టీ’లో హిందువులకు బీపీ.. ముస్లింలకు షుగర్

Update: 2016-12-18 11:35 GMT
ఇప్పటివరకూ ఎవరూ చూడని యాంగిల్ లో ఒక సర్వే ఫలితం వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలోని హిందూ.. ముస్లిం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఒక అధ్యయనానికి సంబంధించిన అంశాలు బయటకు వచ్చాయి. ఆసక్తికరంగా మారిన ఈ అధ్యయనంలోని వివరాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండటం గమనార్హం.

రెండు వర్గాలకు చెందిన ప్రజల్లో 20 నుంచి 29 ఏళ్లు.. 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్ని చూస్తే..

= తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బీపీతో ఇబ్బందులు పడుతుంటే.. ముస్లింలు షుగుర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

= మొత్తంగా చూస్తే హిందువుల్లో 38.1 శాతం మంది బీపీతో ఇబ్బంది పడుతుంటే.. ముస్లింలు 31.2 శాతం మంది ఇదే సమస్యతో ఉన్నట్లు గుర్తించారు.

= ఇక.. షుగర్ సమస్యలు హిందువులతో పోలిస్తే ముస్లింలలోనే ఎక్కువని తేలింది.

= ముస్లింలలో 9 శాతం మంది షుగర్ సమస్యల్ని ఎదుర్కొంటుంటే.. హిందువులు మాత్రం 8.2 శాతం మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

= ఈ గణాంకాలు ఇరవైఏళ్ల వయసులో ఉన్న హిందూ.. ముస్లింలకు సంబంధించి కావటం గమనార్హం.

= బీపీ.. షుగర్ సమస్యలకు సంబంధించి కారణాల్ని వెతికినప్పుడు.. ఆయా వర్గాల ప్రజలు తీసుకుంటున్న ఆహారం.. వారి జీవనవిధానమే ఈ ఆరోగ్య సమస్యలకు కారణంగా తేల్చారు.

= హిందువులు తీసుకుంటున్న ఆహారం బీపీకి కారణంగా మారితే.. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటున్న ముస్లింలు షుగర్ సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా తేల్చారు.

= హిందువుల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది తమ ఆరోగ్య సమస్యలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుంటే.. ముస్లింలలో మాత్రం ఇది కేవలం 47 శాతం మాత్రమే ఉందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News