మరో మూడు రోజుల్లో తిరుపతి లోక్ సభ కి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనితో అన్ని పార్టీల నేతలు కూడా ప్రచారంలో మునిగితేలుతున్నారు. అయితే, తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు చింతా మోహన్ ఒంటరి పోరాటం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ రకంగా చూస్తే స్థానికంగా ఆయనకి ఉన్న ఇమేజ్ , పలుకుబడి ,పలు రకాల రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తే .. అయన మిగిలిన పార్టీలకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అలాగే అయన సీఎం జగన్ ను టార్గెట్ చేసుకొని చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవ్వడంతో అయనకి మరింత ఇమేజ్ పెరిగింది. రుపతి పార్లమెంటు స్థానానికి మొత్తం తొమ్మది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన ఆయన మూడు సార్లు ఓడిపోయారు. ఇక ఇప్పుడు పదోసారి ఆయన తిరుపతి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
ఇక, మరో మూడు రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏవిధంగా ముందుకు సాగాలి, ఏ తరహా ప్లాన్ చేసుకుని వైసీపీకి చెక్ పెట్టాలనే వ్యూహం మాత్రం కాంగ్రెస్ లో పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. కేవలం చింతా మోహన్ మాత్రమే ప్రచారం లో జోరుగా ముందుకు సాగుతున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అప్పుడప్పుడు చూసి వెళ్తున్నారు అంటూ అయన కుటుంబం విమర్శలు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తిరుపతి లో టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా మకాం వేసి, ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రబాబు , నారా లోకేష్ , అచ్చెన్న వంటి వారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేస్తూ , ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక వైసీపీ నేతలు కూడా ప్రచారంలో జోరు చూపిస్తున్నారు.
ఈ క్రమంలో చింతాకు కొంత ఇమేజ్ ఉన్నా ఓట్లు పడతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నా , కాంగ్రెస్ లో మాత్రం ఆ తరహా దూకుడు కనిపించడం లేదు. ఒక విదంగా ఆలోచిస్తే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పటికీ మెజారిటీ తగ్గిస్తే, జగన్ ను కొంత మేరకు నిలువరించినట్టు అవుతుందని ప్రతిపక్షాలుఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మంచి అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ నేతలు వినియోగించుకోవడం లేదనే వాదనే ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు పార్టీలో నేతలు లేరని, అంటున్నారని , అయితే ఉన్న వారిని సమన్వయం చేయడం, ముందుకు నడిపించడం వంటి బాధ్యతలను ఎవరూ తీసుకోకపోవడం చింతా మోహన్ కు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ తరపున రాష్ట్రంలోని సీనియర్లు బయటకి వచ్చి ప్రచారంలో పాల్గొంటే పరిస్థితి మరోలా ఉండేది అని పలువురు చర్చించుకుంటున్నారు.