అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నాయి. దీంతో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురించిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఉండే ఈ శ్వేత సౌధం పూర్వాపరాలు, నిర్మాణ చరిత్ర మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1600 పెన్సిల్వేనియా ఎవెన్యూ నార్త్ వెస్ట్ వాషింగ్టన్ డీసీలో 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. 1800 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ నుంచి ఆ తర్వాతి కాలంలో ఎన్నికైన అగ్రరాజ్య అధ్యక్షులంతా ఈ భవనంలో ఉంటూ వచ్చారు. కాగా, 1792 నుంచి ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. అయితే నిర్మాణ అనంతరం 1800 సంవత్సరం నుంచి ఈ వైట్ హౌస్ లో ఎన్నో మార్పులు చేశారు.
అయితే 1812 సమయంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ ఈ భవనాన్ని తగులబెట్టింది. దీంతో ఈ భవనం దాదాపు నాశనమైపోయింది. అప్పట్లో ఆ ఘటనను "బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్" గా అభివర్ణించారు. అయితే 1812 అనంతరం అధ్యక్షుడిగా వచ్చిన జెమ్స్ మన్రో ఈ భవనానికి పాక్షిక పునర్నిర్మాణం చేసి ప్రవేశించాడు. తర్వాతి కాలంలో 1948లో హేరీ ఎస్.ట్రూమన్ దీని ఇంటీరియర్ గదులను పూర్తిగా కూలగొట్టించి వైట్ పెయింట్ వేయించాడు.
ఇదే క్రమంలో ఇక మోడరన్ హౌస్ కాంప్లెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ - ఈస్ట్ వింగ్ - వెస్ట్ వింగ్ - ఐసెన్ హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వంటివి ఉన్నాయి. అధ్యక్ష - ఉపాధ్యక్ష కార్యాలయ సిబ్బంది - విదేశాంగ శాఖ అధికారులు వీటిలో ఉంటారు. తాజా ఎన్నికల ఫలితాలు అనంతరం హిల్లరీ లేదా ట్రంప్.. ఎవరు అధ్యక్షులైనా ఇక వైట్ హౌస్ ఇక వారిదే!!
ఈ భారీ నిర్మాణంలో 412 తలుపులు - 147 కిటికీలు - 8 స్టైర్ కేస్ లు - 132 గదులు - 35 బాత్ రూం లు ఉన్నాయి. ఈ సౌధానికి బయటవైపు రంగు వేయాలంటే 570 గెలాన్స్ (సుమారు 2157 లీటర్ల) పెయింట్ అవసరమవుతుందట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/