ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టు ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే. ఎక్కువ సార్లు చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించింది ఈ జట్టు. ఆరంభంలో తడబడటం ఆ తర్వాత చెలరేగి ఆడటం ‘ముంబై ఇండియన్స్’ స్టయిల్. ఈ సారి కూడా అదే ధీమాతో రంగంలోకి దిగింది రోహిత్ సేన. అద్భుతమైన బ్యాట్స్మెన్లు, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల ఫీల్డర్స్ ఆ జట్టు సొంతం. అయితే ఆ సారి ఎందుకో ఈ జట్టు కాస్త వెనకబడ్డట్టు అనిపిస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ విలవిల లాడిపోయారు. చాలా తక్కువ స్కోర్ చేశారు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపును నమోదు చేసుకున్నది.
చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న రాత్రి ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డ విషయం తెలిసిందే. స్పిన్నర్ అమిత్ మిశ్రా అదరగొట్టాడు. వరసగా ముంబై బ్యాట్స్మెన్లను
పెవిలియన్ పంపించాడు.
అమిత్ మిశ్రా దాటికి ముంబై బ్యాట్స్మెన్లు విలవిలలాడిపోయారు.
ఈ మ్యాచ్ లో ఓడిపోవడమే కాదు.. రోహిత్ కు మరో నష్టం కూడా కలిగింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడు రూ. 12 లక్షలు ఫైన్ కట్టాల్సి వచ్చింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో ఇది రెండో జరిమానా.
ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెత్తిన 12 లక్షల రూపాయల ఫైన్ పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఎంఎస్ ధోనీ ఫైన్ కట్టాడు.మరోసారి స్లోయర్ ఓవర్ రేట్‌ను నమోదు చేస్తే.. రోహిత్ శర్మకు పడే జరిమానా రెట్టింపు అవుతుంది. అదే సమయంలో ఆ మ్యాచ్ ను ఆడిన 11 మంది క్రికెటర్లకు కూడా ఫైన్ మొత్తాన్ని వర్తింపజేస్తారు నిర్వాహకులు. ఇక మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేస్తే.. కెప్టెన్ కు ఓ మ్యాచ్ కు వేటు పడే అవకాశం కూడా ఉంది.