ఒమిక్రాన్ మూలాల్లో హెచ్.ఐ.వీ!

Update: 2021-12-22 03:57 GMT
ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది కరోనా కొత్త రకం ‘ఒమిక్రాన్’ వైరస్. ప్రచండ వేగంతో విస్తరిస్తూ అమెరికా, యూరప్ దేశాలను అల్లాడిస్తోంది. టీకా తీసుకున్న వారిలోనూ ఇన్ ఫెక్షన్ కలిగించేంత శక్తి ‘ఒమిక్రాన్’కు ఎలా వచ్చింది? దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందినఈ వైరస్ అక్కడ నుంచి ఎలా బలంగా తయారైందనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

తాజాగా ‘ఒమిక్రాన్’పై లోతుగా దర్యాప్తుచేసిన దక్షిణాఫ్రికా పరిశోధకులకు షాకింగ్ విషయం తెలిసింది. ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందని ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తాజాగా యూరప్ దేశాల హెచ్.ఐ.వీ, ఎయిడ్స్ సంయుక్త నియంత్రణ కార్యక్రమం ‘యూఎన్ఎయిడ్స్’ నిరుడు ఓ నివేదికను జారీ చేసింది. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీకి గురయ్యారని.. ప్రపంచ హెచ్.ఐవీ కేంద్రంగా ఆ దేశం మారింది. హెచ్ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడని వారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి ఇతరత్రా వ్యాధులకు ఆలవాలంగా మారుతోంది.

సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని..ఆమె శరీరంలోని హెచ్.ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్ గా అవతరించిందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ బృందం కూడా ఇలాంటి అబిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో కరోనా విజృంబించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టే.. అక్కడే ఒమిక్రాన్ గా అవతరించి ఉండొచ్చు అని డా.కెంప్ వివరించారు.


Tags:    

Similar News