ఎయిడ్స్ మందులతో కరోనాకి చికిత్స ...

Update: 2020-03-10 13:30 GMT
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా ..ప్రస్తుతం భారత్ లో ఉగ్రరూపం దాల్చుతోంది. అయితే, దీనికి ఇప్పటిదాకా ఎటువంటి మందు కనిపెట్టలేదు. కరోనా నివారణకు మార్కెట్లో ఎటువంటి మందులు  ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం, అది వాడితే కరోనా తగ్గుతుంది, ఇది వాడితే కరోనా తగ్గుతుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స కోసం హెచ్‌ ఐవి పేషంట్లు వాడే మందులును ఉపయోగిస్తున్నారు.

భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్‌ లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ ఐ వి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. ఇప్పటికే వారినుండి  అనుమతి కూడా తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ ఐ వి మందులను వాడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి అనుమతి తీసుకున్నామని తెలిపారు. ఆ తరువాతే Lopinavir, Ritonavir కాంబినేషన్‌ ధెరపీకి ఆమోదం లభించింది.

ఈ మందులను జైపూర్ ఆసుప్రతిలో చేరిన ఇటాలియన్ జంటకు వాడుతున్నారు. అయితే వ్యాధినిరోధక శక్తి తక్కువున్నవాళ్లమీద ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ. ఎయిడ్స్ వ్యాధి కూడా ఇంతే. వ్యాధినిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. కరోనాకు ఇంతవురకు ఎలాంటి చికిత్స లేదు. వ్యాధినిరోధక శక్తి తక్కువున్నవాళ్లమీద ప్రభావం ఎక్కువ. ఎయిడ్స్ కూడా ఇంతే. వ్యాధినిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. అందుకే HIV మందుని   చైనాలో కూడా ఉపయోగించారు. అయితే, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడే ఏమి చెప్పలేము అన్నారు.

కరోనా వైరస్ సోకిన 69 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి జ్వరం లేదు, ఆరోగ్యం నిలకడగా ఉంది. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆశిస్తున్నాం. కరోనా సోకిన అతని భార్య కూడా మా వైద్యానికి ఒప్పుకున్నారని అన్నారు  Medical and Health and Family Welfare అదనపు ఛీప్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్. భారత దేశంలో 70 శాతం మంది మాత్రం హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఈ మందులున్ని వాడుతున్నారు. దేశంలోని ప్రజారోగ్య పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని అత్యవసర సమయంలో మాత్రమే ఈ మందుని వాడే విధంగా రూల్స్ చేపట్టినట్టు తెలిపారు.
Tags:    

Similar News