కరోనా వ్యాక్సిన్​తో హెచ్​ఐవీ.. ట్రయల్స్​ నిలిపివేసిన సంస్థ..!

Update: 2020-12-12 12:30 GMT
కరోనా వ్యాక్సిన్​ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇప్పటికే పలుదేశాలు కరోనా వ్యాక్సిన్​ కోసం ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. చాలా దేశాల్లో క్లినికల్​ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ సాగుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ, సీఎల్​ఎల్​ ఔషధ సంస్థ సంయుక్తంగా ఓ వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్​ కోసం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్​ దశలో ఉంది. అయితే వ్యాక్సిన్​ ఇచ్చిన కొంతమందికి హెచ్​ఐవీ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందట. దీంతో వెంటనే ట్రయల్స్​ ఆపేశారు.

ఆస్ట్రేలియా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్​ మొదట సత్ఫలితాలు ఇచ్చింది. తొలి, రెండో దశ ట్రయల్స్​ సక్సెస్​ అయ్యాయి. కానీ చివరిదశ ట్రయల్స్​లో మాత్రం దుష్ప్రభావాలు కనిపించాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

‘మేం తయారుచేసిన వ్యాక్సిన్​ చక్కగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్​ ఉత్పత్తి చేస్తున్న యాంటీబాడీలు కరోనా వైరస్​ను ఎదుర్కొంటున్నాయి. అయితే కొంతమంది రోగుల్లో హెచ్​ఐవీ పాజిటివ్​ రావడాన్ని గుర్తించాం. నిజానికి సదరు వ్యక్తులకు మా వ్యాక్సిన్​ వల్ల హెచ్​ఐవీ రావడం లేదు. కానీ హెచ్​ఐవీ పరీక్షలు చేసినప్పుడు పాజిటివ్​గా చూపిస్తుంది.

ఈ వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో జోక్యం చేసుకుంటున్నాయి. అందుకే అలా చూపిస్తుంది. వాళ్లకు ఏ ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ మేం ట్రయల్స్​ నిలిపివేశాం. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు సాగుతున్నాయి’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియా ఇతర దేశాలకు చెందిన కంపెనీలతోనూ వ్యాక్సిన్​ పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. దేశీయ వ్యాక్సిన్​ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ప్రజలకు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్​ తీసుకొచ్చి పంపిణీ చేస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతున్నది.
Tags:    

Similar News