సరిహద్దుల్లో ఉండి కల్లోలానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన జమ్ముకశ్మీర్ కు సంబంధించిన అనూహ్యమైన వార్త ఇది. ఆ రాష్ట్రంలోని ఉగ్రవాదులు కీలక సందేశం పంపారు. ప్రతి ఏటా అమర్ నాథ్ యాత్రకు ప్రధానంగా ఉగ్రవాదుల నుంచే పెను ముప్పు పొంచి ఉంటుంది. గతేడాది యాత్ర సందర్భంగా కూడా యాత్రికుల బస్సుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అది సంచలనం అయ్యింది. అయితే ఈసారి మాత్రం హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు వినూత్న సందేశాన్ని పంపించారు. ఈసారి యాత్రికులపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని హిజ్ బుల్ స్పష్టంచేసింది.
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ లేఖ ఆనందం - ఆశ్చర్యం కలిగించింది. ఈ మధ్యే జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వాయిద్ అమర్ నాథ్ యాత్రపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందంటూ భద్రతను పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో పలువర్గాల్లో ఉగ్రవాదుల చర్యలపై భయం మొదలైంది. ఈ క్రమంలో మీరు ఎలాంటి భద్రత లేకుండా యాత్రకు వెళ్లొచ్చు అంటూ హిజ్ బుల్ ముజాహిదీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకు ఓ ఆడియో సందేశం విడుదల చేయడం విశేషం.
ఇంకా ఆ ప్రకటనలో ఏముందంటే.. ``ఉగ్రముప్పు నిజం కాదు. మేం ఎలాంటి దాడి ప్రణాళిక రచించలేదు. మేమెప్పుడూ వాళ్లపై దాడి చేయబోం`` అని ఆ సందేశంలో హిజ్ బుల్ నేత చెప్పాడు. ``వాళ్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు. గతంలో మేమెప్పుడూ అమర్ నాథ్ యాత్రికులపై దాడి చేయలేదు. మా పోరాటం యాత్రికులపై కాదు. మా వాళ్లపై దాడులకు పాల్పడుతున్న వారితోనే మా పోరాటం`` అని ఆ సందేశం స్పష్టంచేసింది.
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ లేఖ ఆనందం - ఆశ్చర్యం కలిగించింది. ఈ మధ్యే జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వాయిద్ అమర్ నాథ్ యాత్రపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందంటూ భద్రతను పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో పలువర్గాల్లో ఉగ్రవాదుల చర్యలపై భయం మొదలైంది. ఈ క్రమంలో మీరు ఎలాంటి భద్రత లేకుండా యాత్రకు వెళ్లొచ్చు అంటూ హిజ్ బుల్ ముజాహిదీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకు ఓ ఆడియో సందేశం విడుదల చేయడం విశేషం.
``మీకు భద్రత అవసరం లేదు.. మీరు మా అతిథులు అంటూ ఆ 15 నిమిషాల ఆడియో సందేశంలో రియాజ్ చెప్పాడు. అంతేకాదు 1990ల్లో కశ్మీర్ వదిలి వెళ్లిపోయిన పండిట్ లందరూ తిరిగి రావచ్చు` అని అన్నాడు. అయితే వాళ్లకు ప్రత్యేకంగా కాలనీలు మాత్రం ఉండకూడదన్న షరతు మాత్రం పెట్టాడు.