కరోనా మహమ్మారికి హోమియో వ్యాక్సిన్ సిద్ధం !

Update: 2020-04-15 14:30 GMT
కరోనా మహమ్మారి .. కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. కానీ , ఈ వ్యాధికి ఇప్పటివరకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడంతో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. అయితే , కరోనా ను ఎదుర్కోవాలంటే మన ముందున్న ఏకైక మార్గం కరోనాకి సరైన మందు కనిపెట్టడమే. ప్రస్తుతం దాని తయారీలో అనేక సంస్థలు తలమునకలై ఉన్నాయి. అయితే, ఆ వ్యాక్సిన్ మార్కెట్ లోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రెండు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి బల్గేరియాలో డాక్టర్‌ ఎన్‌ గ్రిగొరొవా హోమియోలో చేసిన ప్రయోగం. మరొకటి సముద్రపు రాళ్లపై దొరికిన ఎర్ర నాచు వైరస్ ఎదుర్కొనే శక్తి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఒక వ్యాధిని ఎదుర్కోవడానికి అల్లోపతిలో సజీవంగా ఉండే వ్యాధి కారక వైరస్‌ లేదా బ్యాక్టీరియా లేదా మరేదైనా అంశాన్ని పొటెన్సీ స్థాయిల్లోకి తీసుకువచ్చి శరీరంలో ప్రవేశపెడతారు. అదే హోమియోలో వ్యాధికారక శక్తి మృత కణాల నుంచి నోసోడ్‌ని తయారు చేస్తారు.

దీనిని పొటెన్సీ రూపంలోకి తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత ప్రపంచానికి వెల్లడిస్తారు. అల్లోపతిలో ఒక టీకా తయారై మార్కెట్‌ లోకి రావాలంటే కనిష్ఠంగా ఏడాదిన్నరకుపైనే పడుతుంది. అదే హోమియోపతిలో గరిష్ఠంగా 40 రోజుల్లో నోసోడ్‌ తయారు చేయవచ్చని 25 ఏళ్లుగా నవనీత ఉచిత హోమియో వైద్యశాలను నడుపుతున్న డాక్టర్‌ రమేశ్‌ కొంగర తెలిపారు. నోసోడ్‌ తయారీకి అనుమతి కోరుతూ పీఎంఓకి - హోమియో కౌన్సిల్‌ కి ఇప్పటికే లేఖలు రాశామని చెప్పారు. బల్గేరియాలో దీన్ని పరీక్షల నిమిత్తం ఉచితంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారని చెప్పారు.
Tags:    

Similar News