కుటుంబ సంబంధాలు ఇప్పుడు సహజీవనం.. స్వలింగ సంపర్కుల రూపంలోనే.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Update: 2022-08-29 06:30 GMT
విదేశాల్లో ఇలా ఇద్దరు మగాళ్లు, ఇద్దరు స్త్రీలు (లెస్బియన్ లు) పెళ్లి చేసుకోవడం నేరం కాదు.. మన దేశంలోనూ సుప్రీం కోర్టు  అప్పట్లో దీనిపై సంచలన తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377 కొట్టేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. లెస్బియన్, ట్రాన్స్ జెండర్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిందేని.. అందిరితోపాటు వారికి సమాన హక్కులుంటాయని సుప్రీం స్పష్టం చేసింది.

ఈ చారిత్రక తీర్పుపై లెస్బియన్, గేస్, బై సెక్స్ వల్స్, ట్రాన్స్ జెండర్స్(ఎల్.జీ.బీ.టీ)లు సంబరాలు చేసుకున్నారు. కానీ దీనిపై సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు.  విదేశాల్లో మాత్రం ఇలాంటి పెళ్లిళ్లు తరచూ జరుగుతుంటాయి. అందుకే అక్కడ పెద్దగా తేడా లేదు. వివాహాలు ఘనంగా చేసుకుంటారు. ఈ  తీర్పు వచ్చాక దేశంలో ఇద్దరు మగాళ్లు..ఇద్దరు ఆడవాళ్లు బహిరంగంగా పెళ్లి చేసుకోవడం.. కలిసి కాపురం చేయడం ఎక్కువైంది.

ఇక సహజీవనం కూడా తప్పు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు ఆడ, మగ కలిసి ఇష్టపూర్వకంగా పెళ్లికాకుండా కలిసి ఉండడాన్ని సమర్థించింది.దీన్ని వారి వ్యక్తిగత స్వేచ్ఛగా తీర్పుల్లో అభివర్ణించింది.

ఇప్పుడు ఈ సహజీవనం, స్వలింగ సంపర్కం పై సుప్రీంకోర్టు కొత్త నిర్వచనం ఇచ్చింది. కుటుంబానికి అర్థం మార్చేసింది.కుటుంబం అంటే తండ్రి, తల్లి, పిల్లలనే సంప్రదాయ భావన ఉందని.. దీనికి బిన్నమైన రూపాల్లోనూ కుటుంబ సంబంధాలు ఉండొచ్చని..వాటికీ చట్టపరమైన రక్షణ అవసరమనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది.

అవివాహిత భాగస్వామ్యాలు, స్వలింగ సంపర్కం లాంటి సంబంధాలు ఈ భిన్నమైన రూపాల కిందకు వస్తాయని న్యాయమూర్తులు  వ్యాఖ్యానించారు.

గత వివాహ బంధంలో భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరిపై సంరక్షణకు మహిళ ప్రసూతి సెలవు తీసుకున్నందున.. ఇప్పుడు తాను జన్మనిస్తున్న బిడ్డకు చట్టపరంగా సెలవును నిరాకరించడం సరికాదని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News