అల్ల‌ర్లు రోజు అన్ని డ‌బ్బులు పంచిన హ‌నీప్రీత్‌

Update: 2017-10-06 12:35 GMT
డేరా బాబా అలియాస్ గుర్మీత్ ద‌త్త‌పుత్రిగా ప్ర‌చారం చేసుకునే హ‌నీప్రీత్ ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు సాధ్వీల‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేసిన నేరానికి ఇర‌వైఏళ్లు జైలుశిక్ష విధించిన స‌మ‌యంలో ఆయ‌న్ను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌ను ప్రేరేపించిన నేరం హ‌నీప్రీత్ మీద ఉంది.

గుర్మీత్ కు జైలుశిక్ష ప‌డిన నాటిని నుంచి అండ‌ర్ గ్రౌండ్‌ లోకి వెళ్లిన ఆమెను ఇటీవ‌ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే.

విచార‌ణ‌లో భాగంగా తొలిరోజు పోలీసుల‌కు సరైన స‌మాచారం ఇవ్వ‌ని ఆమె.. తాజాగా మాత్రం అదిరిపోయే స‌మాచారాన్ని అందించిన‌ట్లుగా తెలుస్తోంది. డేరా స‌చ్చా సౌధాలో జ‌రిగిన అన్ని లావాదేవీల్ని హ‌నీప్రీత్ స్వ‌యంగా చేసిన‌ట్లుగా ఆధారాలు ల‌భించిన‌ట్లుగా చెబుతున్నారు.

పోలీసుల విచార‌ణ‌లో గుర్మీత్ అరెస్ట్ రోజు చోటు చేసుకున్న అల్ల‌ర్ల‌కు ప్రేరేపించిన వారికి త‌న చేతుల మీదుగా న‌గ‌దు ఇచ్చిన  విష‌యాన్ని ఆమె చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. చివ‌ర‌కు గుర్మీత్ సింగ్ కుటుంబ స‌భ్యుల‌కు ఇచ్చే డ‌బ్బుల లెక్క‌ను కూడా హ‌నీప్రీత్ మానిట‌ర్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది

గుర్మీత్‌ కు జైలుశిక్ష విధించిన రోజున చోటు చేసుకున్న అల్ల‌ర్లు సంద‌ర్భంగా 42 మంది ప్రాణాల్ని తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సిర్సా ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగిన స‌మ‌యంలో వాటిని ప్రేరేపించ‌టానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు కోసం హ‌నీప్రీత్ సింగ్ రూ.1.25 కోట్లు పంచిన‌ట్లుగా చెబుతున్నారు.

గుర్మీత్ అనుచ‌రుడి ద‌గ్గ‌ర ఈ మొత్తాన్ని పోలీసులు సాధ్వీనం చేసుకున్నారు. కోర్టుకు హాజ‌ర‌వుతున్న హ‌నీ ప్రీత్‌ను సీబీఐ ఐదు రోజుల పాటు విచార‌ణ చేసేందుకు అనుమ‌తి పొందింది. ఈ నేప‌థ్యంలో మొద‌టి రోజుతో పోలిస్తే తాజాగా చేసిన విచార‌ణ సంద‌ర్భంగా ఓపెన్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌పెడ‌తారో? ఆ దెబ్బ‌కు ఇంకెవ‌రి వికెట్ లేచిపోతుందో చూడాలి మ‌రి.
Tags:    

Similar News