ఆ అంద‌మంతా ఏమైపోయింది హ‌నీ?

Update: 2017-10-07 10:56 GMT
డేరాబాబా అలియాస్ గుర్మీత్ ఎపిసోడ్ లో పిచ్చ పాపుల‌ర్ అయిపోయింది హ‌నీప్రీత్ సింగ్‌. డేరాబాబాకు ద‌త్త కుమార్తెగా చెప్పే ఆమెకు సంబంధించి బోలెడ‌న్ని ముచ్చ‌ట్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. డేరా బాబా ఒక వెలుగు వెలిగిన వేళ‌లో.. ఆయ‌న తీసే సినిమాల్లో త‌ళుక్కున మెరిసిపోయే హ‌నీప్రీత్‌ను చూసి చాలామంది చాలానే చెప్పుకునే వారు.

ఎప్పుడైతే డేరా బాబాకు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ పంచ‌కుల కోర్టు తీర్పు ఇచ్చిందో.. భారీ ఎత్తున అల్ల‌ర్లు చోటు చేసుకోవ‌టం.. ప‌దుల సంఖ్య‌లో అమాయ‌కులు మృత్యువాత ప‌డ‌టం.. కోట్లాది రూపాయిల ఆస్తిన‌ష్టం వాటిల్లటం తెలిసిందే. ఇద్ద‌రు సాధ్వీల‌ను లైంగికంగా వేధించిన కేసులో శిక్ష ప‌డితే ఇంత హింసా అని షాక్ తిన్నోళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకిలా అంటే.. దాని వెనుక గుర్మీత్ ద‌త్త‌కుమార్తెగా చెప్పే హ‌నీప్రీత్ కార‌ణంగా తేల్చారు.

పెద్ద ఎత్తున డ‌బ్బుతో ఇలాంటి హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు ఆమె పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఆమెను అదుపులోకి తీసుకోవ‌టానికి పోలీసులు ప‌డిన పాట్లు అన్నిఇన్ని కావు. లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఆమె ప‌త్తా లేక‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది. ఆమె.. జాడ కోసం రెండు రాష్ట్రాల పోలీసులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ వెతికినా దొర‌క‌లేదు. అలాంటి వేళ‌..  కోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ రాకపోవ‌టంతో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోక త‌ప్ప‌లేదు.

ఇదిలా ఉంటే.. ఎంపిక చేసిన‌ మీడియాకు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన ఆమెను.. త‌ర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా హ‌నీప్రీత్ ను చూసినోళ్లంతా ఒక విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకోవ‌టం మొద‌లైంది. డేరాబాబా తీసే సినిమాల్లో వెలిగిపోయే హ‌నీప్రీత్ ముఖం.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన స‌మ‌యంలో మాత్రం జిడ్డుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

మెసెంజ‌ర్ ఆఫ్ గాడ్ లాంటి సినిమాల్లో క‌ళ్లు తిప్పుకోలేనంత అందంతో అల‌రించిన హ‌నీ.. ఇప్పుడు నూనె ముఖంతో జిడ్డు కార‌టం చూసిన వాళ్లకు ఏమిటిలా? ఎందుకిలా? అన్న ప్ర‌శ్న‌లు వేసుకోవ‌టం కనిపిస్తుంది. ఇంత‌కాలం మేక‌ప్ చాటున జిడ్డు ముఖాన్ని దాచేసింద‌న్న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఏమైనా పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం ఏమో కానీ.. హ‌నీ అస‌లు రూపాన్ని అయితే చూసే అవ‌కావం ద‌క్కింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News