28 కోట్ల డ్రగ్స్ కోసం హానీ ట్రాప్.. పట్టుబడ్డ భారతీయుడు

Update: 2023-01-11 23:30 GMT
మహిళ మాయలో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా పట్టుబడ్డాడు ఓ భారతీయుడు. తనను బెదిరించి హానీ ట్రాప్ చేసి ఇలా ఇరికించారని అతడు ఆరోపించాడు. నిజంగా డ్రగ్స్ తరలించి పట్టుబడ్డాడా? లేక నిజంగానే ఇలా హానీట్రాప్ కు గురయ్యాడా? అని పోలీసులు ఆరాతీస్తున్న పరిస్థితి నెలకొంది.
 
28 కోట్ల విలువైన కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన భారత జాతీయుడిని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) పక్కా ప్రణాళికతో రహస్య ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. అంతర్జాతీయ నిషేధిత మాదక ద్రవ్యాల మార్కెట్‌లో రూ.28.10 కోట్ల విలువైన 2.810 కిలోల కొకైన్‌తో వ్యక్తి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

ఆ వ్యక్తి నేరం చేయడానికి హనీ-ట్రాప్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు.   అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొకైన్‌ను ప్రత్యేకంగా రూపొందించిన డఫెల్ బ్యాగ్‌లో పొరలుగా దాచారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని ఫేస్‌బుక్‌లో ఓ మహిళతో స్నేహం చేశానని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే తర్వాత ఆమెతో సన్నిహితంగా మాట్లాడి హనీ ట్రాప్ అయ్యాడు. వాళ్లు చెప్పినట్టు చేయకపోతే తన రహస్యాలు బయటపెడుతానని బెదిరించారని తెలిపారు.

ఇథియోపియన్ రాజధాని అడిస్ అబాబా నుండి కొకైన్ తీసుకువెళ్లాడు. క్లాత్ శాంపిల్స్‌లో కొకైన్ ప్యాక్ చేయబడిందని.పార్శిల్‌ను ఢిల్లీలోని ఒక వ్యక్తికి డెలివరీ చేయాల్సి ఉందని అధికారులు పట్టుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News