రాఖీపై ప‌రువున‌ష్టం కేసు వేసిన 'స‌వతి'

Update: 2018-01-05 06:24 GMT
బాలీవుడ్ న‌టి.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కే రాఖీ సావంత్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఆ మ‌ద్య‌న డేరా బాబా ఎపిసోడ్ నేప‌థ్యంలో.. బాబుకు స‌న్నిహితంగా ఉండే హ‌నీప్రీత్ విష‌యంలో రాఖీ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా ప‌రువున‌ష్టం కేసు ఎదుర్కొంటున్నారు.

త‌న కుమార్తె  హ‌నీప్రీత్ మీద అడ్డ‌గోలు వ్యాఖ్య‌ల‌తో రాఖీ ప‌రువు తీసింద‌ని ఆమె త‌ల్లి ఆశా త‌నేజా డిమాండ్ చేస్తోంది. త‌న కుమార్తెపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన వైనాన్ని ఒప్పుకుంటూ 30 రోజుల్లోపు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో  రూ.5కోట్లు ప‌రువున‌ష్టం ప‌రిహారం కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చ‌రిస్తున్నారు.

రాఖీ ప్ర‌ధాన పాత్ర‌లో డేరా బాబా-హ‌నీల‌పై తీస్తున్న సినిమా మ‌రికొద్దిరోజుల్లో రిలీజ్ అవుతున్న వేళ‌.. హ‌నీ త‌ల్లి ప‌రువున‌ష్టం దావా వేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. హ‌నీ మీద గ‌తంలో రాఖీ సావంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త ఆగ‌స్టులో డేరా బాబా ఇష్యూ తెర మీద‌కు వ‌చ్చిన స‌మ‌యంలో రాఖీ మాట్లాడుతూ హ‌నీ మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

తాను ఒక ద‌శ‌లో డేరా బాబాకు చాలా ద‌గ్గ‌ర‌య్యాన‌ని.. త‌మ ఇద్ద‌రిదీ ప‌విత్ర‌బంధ‌మ‌ని రాఖీ పేర్కొన్నారు. అయితే.. త‌మ మ‌ధ్య బంధం హ‌నీ జీర్ణించుకోలేక‌పోయేద‌న్నారు. డేరా బాబాను పెళ్లి చేసుకుంటే ఎక్క‌డ స‌వతిని అవుతానోన‌ని హ‌నీ భ‌య‌ప‌డేదంటూ వ్యాఖ్య‌లు చేశారు. త‌న మాట‌ల‌తో డేరా బాబా.. హ‌నీప్రీత్‌కు మ‌ధ్య తండ్రికూతుళ్ల సంబందం లేద‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై ఇన్ని నెల‌ల త‌ర్వాత హ‌నీ త‌ల్లి సారీ చెప్పాల‌ని డిమాండ్ చేయ‌టం.. లేదంటే భారీ మొత్తంలో ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News