నిత్యం విదేశీయుల రాకతో కళకళలాడుతూ.. విందులు.. వినోదాలతో పాటు.. విదేశీయుల్ని తెగ ఆకర్షించే హాంకాంగ్ గడిచిన మూడు వారాలుగా ఆందోళనలతో అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం బ్రిటీష్ పాలనలో ఉన్న హాంకాంగ్.. ఆ మధ్యనే హాంకాంగ్ ను చైనా స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఆ దేశ ప్రజల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అనుమానిత నేరగాళ్లను చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంకాంగ్ నాయకత్వం నిర్ణయంతో హాంకాంగ్ వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో పెట్టటాన్ని తప్పు పడుతున్నారు. చైనాకు పెత్తనాన్ని ఇచ్చేందుకు సుతారం ఇష్టపడని వేళ..తాజా బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా హెల్మెట్ పెట్టుకొన్న పలువురు నిరసనకారులు.. దేశ పార్లమెంటులోకి దూసుకెళ్లిన వారు.. అక్కడి చిత్రపటాలను చించేశారు. గోడలపై రంగులు పూశారు. పోలీసులతో ఘర్షణ పడటం గమనార్హం. దీంతో ఆందోళనాకారుల్ని కంట్రోల్ చేసేందుకు లాఠీ ఛార్జ్ తో పాటు.. భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. దీంతో.. హాంకాంగ్ పార్లమెంటు మొత్తం ఆగమాగంగా మారింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒప్పందంలో భాగంగా బ్రిటీష్ పాలన ముగిసి చైనాకు హాంకాంగ్ ను అప్పగించిన రోజునే తాజా విధ్వంసం చోటు చేసుకుంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.