నీళ్లు అడిగాడని కరోనా పేషేంట్ ను చితక బాదేశారట .. ఎంత ఘోరం!

Update: 2020-09-19 11:50 GMT
కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే, కరోనాతో మరణించే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. అలాగే అక్కడక్కడా కరోనా బాధితులపై కూడా దాడులు జరుగుతున్నాయి. తాగడానికి నీళ్లు అడిగినందుకు ఓ కరోనా‌ పేషెంట్‌ ని నర్సింగ్‌ సిబ్బంది చితకబాదిన వీడియో నిన్నటి నుండి సోషల్ మీడియాలో, ప్రసారమాధ్యమాల్లో ప్రసారం అవుతుంది. ఈ సంఘటన పది రోజుల క్రితం జరగగా .. ప్రస్తుతం ఆ బాధితుడు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ప్రభాకర్‌ పాటిల్‌ అనే వ్యక్తి రాజ్ ‌కోట్‌ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. పరీక్షల అనంతరం అతడి కిడ్నీలో నీరు చేరిందని ఆపరేషన్‌ చేయాలని తెలిపారు వైద్యులు. దాంతో ప్రభాకర్‌ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. సమస్య తీరిపోయింది అనుకుంటుండగా ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దాంతో వైద్యులు అతడికి కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్‌ గా తేలింది. ఈ క్రమంలో ప్రభాకర్‌ సెపప్టెంబర్‌ 8న రాజ్‌ కోట్‌ కరోనా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా నర్సింగ్‌ సిబ్బందిని కోరాడు. దాంతో వారు ప్రభాకర్‌పై దాడి చేశారు. మీడియాలో తెగ వైరలయిన ఈ వీడియోలో నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు కలిసి ప్రభాకర్‌ మీద దాడి చేయడం చూడవచ్చు. అతడిని కిందపడేసి కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించారు. మరో విచారకరమైన విషయం ఏంటంటే.. ప్రభాకర్‌ ఈ నెల 12న మరణించాడు. దీని గురించి అతడి సోదరుడు విలాస్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ‘గత శనివారం నా సోదరుడు మరణించాడు. అంతకు ముందే సిబ్బంది తనని దారుణంగా కొట్టారు. మరణించిన అనంతరం తన మృతదేహాన్ని కూడా మాకు అప్పగించలేదు. దానికి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే , దీనిపై ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. సదరు రోగి మెంటల్‌ కండీషన్‌ సరిగా లేదు. వైద్యం చేయడానికి సహకరించడం లేదు. ఈ క్రమంలో తనకు లేదా ఇదరులకు గాయాలు కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే తనని అడ్డుకున్నాం తప్ప కొట్టడం, తోయ్యడం వంటివి చేయలేదు అన్నారు.
Tags:    

Similar News