కొన్నిసార్లు అంతే. కొంతమంది తాము అనుకున్నది ఏదైనా చేయగలుగుతారు. ఖమ్మంలో తాజాగా ముగిసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభను చూస్తే.. ఇదే విషయం బోధ పడుతుంది. ఇంత భారీగా ఒక బహిరంగ సభను నిర్వహించటం అంత తేలికైన విషయం కాదు. మరింత భారీగా నిర్వహించిన బహిరంగ సభతో గులాబీ పార్టీకి జరిగిన ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. సాధారణంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత.. దాని తాలుకూ పాజిటివ్ వేవ్ పార్టీపైనా.. రాజకీయాల మీద పడుతుంది.
ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తాలూకు ఎఫెక్టు పెద్దగా లేదన్న మాట రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. వందల కోట్లు ఖర్చు చేసి చేపట్టిన ఈ సభ కారణంగా బీఆర్ఎస్ కు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. అసలు ఖమ్మం సభకు ఎంత ఖర్చు అయ్యింది? అన్న ప్రశ్న వచ్చినంతనే ఎవరికి వారు వారి నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తుంటారు.
దాదాపు 100 ఎకరాలు (70 ఎకరాలు సభా స్థలి కోసమేనని చెబుతున్నారు) స్థలంలో దాదాపు 70వేల కుర్చీలను వేసి మరీ నిర్వహించిన భారీ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ చేసిన ఖర్చు దగ్గర దగ్గర రూ.200 కోట్లు ఉంటుందని కోమటిరెడ్డి లాంటి నేతలు చెబుతున్నా.. వాస్తవ కోణంలో చూస్తే మాత్రం రూ.125 కోట్లకు ఏ మాత్రం తగ్గదన్న మాట వినిపిస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సభకు లక్షన్నర కూడా రాలేదంటున్నారు.
మొదట్లో జరిగిన ప్రచారం ప్రకారం 3 లక్షల మంది అని చెప్పినా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకదశలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పక్కాగా వస్తారన్న అంచనా వేసుకున్నప్పటికి.. వాస్తవంలో మాత్రం లక్ష అంకెను దాటింది లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. అనుకున్న దాని కంటే తక్కువగా హాజరుపై గులాబీ దళాలు కాస్తంత నిరాశకు గురయ్యేలా చేశాయమంటున్నారు.
దీనికి తోడు కేసీఆర్ స్పీచ్ మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ఆయన చేసిన ప్రసంగం కూడా అంత ఉత్తేజాన్ని ఇవ్వలేదని చెబుతున్నారు. మొత్తంగా ఖమ్మం సభ కోసం వందల కోట్లు ఖర్చు చేసినప్పటికి దాని ఫలితం మాత్రంఅంత సానుకూలంగా లేదనే మాట బలంగా వినిపిస్తోంది. ఇదంతా చూసినప్పుడు ఖమ్మం సభ కేసీఆర్ కోణంలో చూసినప్పుడు మాత్రం పైసా వసూల్ ఏ మాత్రం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోట్లాది రూపాయిల ఖర్చుతో నిర్వహించే ఈ తరహా కార్యక్రమాలు ఆర్థిక భారమే అయినప్పుడు.. భారీతనంలోకి వెళ్లకుండా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఈ తరహా సభలు పార్టీ నేతల్లో.. క్యాడర్ లో కొంత ఉత్సాహాన్ని తగ్గస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.